రైల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలి అని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే .. దసరా సెలవులు సందర్బంగా రైల్లో ప్రయాణం చాల ప్రమాదకరంగా మారింది. మొన్న శుక్రవారం కదులుతున్న విశాఖ ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి దిగేందుకు సామర్లకోట రైల్వేస్టేషనులో బీర కిషోర్‌ ప్రయత్నించాడు. 


ఆ సమయంలో అతని కాలు బోగీ స్ప్రింగ్‌లో ఇరుక్కుంది. దీంతో సుమారు మూడు గంటలు శ్రమించిన రైల్వే సిబ్బంది స్ప్రింగ్‌ను తొలగించి యువకుడ్ని జాగ్రత్తగా బయటకు తీసుకు వచ్చారు. చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ అతను మృత్యువుతో పోరాడుతూ నిన్న రాత్రి మృతిచెందాడు. దీంతో అధికారులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 


కాగా ఈ జాగ్రత్తలు తీసుకుంటే దూరప్రయాణాలు చేసే వారికీ మంచిది అని సూచిస్తున్నారు రైల్వే అధికారులు. 


రైళ్లలో దొంగతలను జరగకుండా ఉండేందుకు ఆర్పీఎఫ్‌, జీఆర్పీ బలగాలు ఎంతమంది ఉన్న సురక్షితంగా, సంతోషంగా రాకపోకలు సాగాలంటే వ్యక్తిగత జాగ్రత్తలు ముఖ్యం.


రైలు కోసం నిరీక్షించే సమయంలో మీ లగేజీని నిర్లక్ష్యంగా వదిలేయవద్దు. ప్రయాణ సమయంలో పక్కవారిని గమనించాలి.


హడావుడిగా రైలు ఎక్కడం, ఫోన్లలో మాట్లాడుతూ బోగీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం చాలా ప్రమాదకరం.  


వీలైనంత తక్కువ లగేజీని వెంట తీసుకువెళ్లాలి. 


ప్రయాణ సమయంలో విలువైన సామగ్రిని తరచూ తీసిచూసుకోవటం మంచిదికాదు.


అపరిచిత వ్యక్తులతో కలిసిపోయినట్లు మాట్లాడటం, వారు ఇచ్చే ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు.


ప్రయాణ సమయంలో హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వినడం హాయిగా ఉంటుంది. కానీ పక్కన శబ్దాలు వినపడకపోవడంతో ప్రమాదాలు జరిగిన గుర్తించలేని పరిస్థితి ఉంటుంది.


గాలి కోసం అని ప్రయాణం సమయంలో రైలు బోగీల తలుపుల వద్ద నిల్చోవడం, కూర్చోవడం చాలా ప్రమాదకరం. అలాంటి ప్రమాదమైన పనులు చేసి ప్రాణాలను పోగొట్టుకోకండి. 


మరింత సమాచారం తెలుసుకోండి: