రాశి, రంభ తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం తెలుగులో ఉన్న సీనియర్ స్టార్ హీరోలతో ఈ హీరోయిన్లు ఎన్నో సినిమాలలో నటించారు. రాశి ఇప్పుడు కూడా కొన్ని సినిమాలలో ముఖ్యమైన పాత్రలలో కనిపిస్తూనే ఉంది. ఈ ఇద్దరు హీరోయిన్లకు విజయవాడ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరు హీరోయిన్లు కలర్స్ అనే సంస్థకు చెందిన పలు వాణిజ్య ప్రకటనలలో నటించారు. 
 
వీరు నటించిన వాణిజ్య ప్రకటనలు టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతున్నాయి. కానీ ఈ ఇద్దరు హీరోయిన్లు నటించిన వాణిజ్య ప్రకటనలు కస్టమర్లను మభ్యపెట్టే విధంగా ఉన్నాయని మరియు ఈ ప్రకటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేవని విజయవాడ వినియోగదారుల ఫోరం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. టీవీ ఛానల్స్ లో ప్రసారం అవుతున్న యాడ్స్ వెంటనే ఆపేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
వినియోగదారుల ఫోరం కోర్టు ప్రసార మాధ్యమాల ద్వారా కలర్స్ సంస్థ  ప్రసారం చేస్తున్న యాడ్స్ అన్నీ నిలిపివేయాలని తీర్పు జారీ ఇచ్చింది. ప్రసార మాధ్యమాలలో ప్రసారం అవుతున్న రాశి, రంభ వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోసపోయానని ఒక బాధితుడు వినియోగదారుల ఫోరానికి ఫిర్యాదు చేశాడు. వినియోగదారుడు కలర్స్ సంస్థకు 74,652 రూపాయలు చెల్లించాడు. 
 
కోర్టు బాధితుడు చెల్లించిన మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి వెంటనే చెల్లించాలని కలర్స్ సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రకటనలలో నటించిన రాశి, రంభలకు కూడా కోర్టు కీలక సూచనలు చేసింది. సెలబ్రిటీలు తప్పుడు ప్రకటనలను ప్రోత్సహించడం సరికాదని కోర్టు పేర్కొంది. సెలబ్రిటీలకు కూడా కొత్త చట్టం ద్వారా జరిమానా విధించే అవకాశం ఉందని వినియోగదారుల ఫోరం కోర్టు చెప్పింది. ఇకముందైనా సెలబ్రిటీలు నటించే ప్రకటనల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: