హైదరాబాద్ లో ప్రతి నిమిషంన్నరకు మెట్రో సదుపాయం అందుబాటులో ఉండే విధంగా అధికారులు కసరత్తు చేపట్టారు. ఈ క్రమంలో అందుకు అనువైన సాంకేతిక పరిజ్ఞానంపై సాధ్య సాధ్యపను సమీక్షిస్తున్నట్టుగా సమాచారం. ఎందులో భాగంగానే  మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. మెట్రో రైలుకు సొంతమైన సీబీటీసీ టెక్నాలజీ ద్వారా 90 సెకన్ల కో రైలు నడిపించవచ్చని తెలిపారు. ఇప్పటికే  మూడు నిమిషాలకు తగ్గించేందుకు మెట్రో అధికారులు దృష్టిని కేద్రీకరుంచినట్టు తెలుస్తుంది.  మూడు కారిడార్లలో రైళ్ల రాకపోకలు ప్రారంభమైతే ప్రయాణికుల సంఖ్య ప్రారంభమై 5 లక్షల నుంచి 10 లక్షలకు చేరుకొంటుందని అంచనా.



ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మూడు కారిడార్లని ఏర్పాటు చేశారు. ఇందుకు అనుగుణంగా 56 మెట్రో రైళ్లు ప్రయాణికులను వారి వారి గమ్యస్థానానికి చేరుస్తున్నాయి, వీటిలో 45 రైళ్లు మెట్రో కారిడార్-1 ద్వారా ఎంట్రో రైలు సేవలను అందిస్తున్నాయి. మొత్తం మీద ఈ  మూడు కారిడార్ లలో దాదాపుగా 800 ట్రిప్పులు నడుస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గతంలో 15 నిమిషాలకో రైలు చొప్పున ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చేవాళ్ళు. అది కాస్తా..  ప్రస్తుతం 5 నిమిషాలకు కుదించారు. హైటెక్‌సిటీ రివర్సల్ అందుబాటులోకి వచ్చాక ఫ్రీక్వెన్సీ పెంచి 5 నిమిషాలకో రైలు నడిపిస్తున్నారు.



ఇదిలా ఉండగా  దీపావళి పండుగకు ముందే హైటెక్‌సిటీ నుంచి రాయదుర్గం ప్రాంతానికి మెట్రోరైలు రాకపోకలు ప్రారంభించనున్నారు. ఇప్పటికే కారిడార్- 3లో నాగోల్ నుంచి హైటెక్‌సిటీ వరకు రైళ్లు రాకపోకలు సాగిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో రాయదుర్గం వరకు మెట్రోను  నడుపనున్నారు. దీని వల్ల ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంత వాసులకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందనే చెప్పాలి. ఈ ప్రాంతంలో తేలికపాటి వర్షానికే విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడతుంది. ఇక ఆ కష్టాలు తప్పినట్టే. కాగా  డిసెంబర్‌లో కారిడార్-2లోని జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గాన్ని ప్రారంభించనున్నట్టు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: