మరో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఉద్యోగాలలో ఎంపికైన వారికి ప్రభుత్వం సొంత గ్రామంలో తప్ప వారు కోరుకున్న చోట ఎక్కడైనా నియమించాలని నిర్ణయం తీసుకుంది. సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఉద్యోగి సొంత మండలంలో మరో గ్రామం లేదా జిల్లాలో కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 
 
ప్రభుత్వం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు మూడు ప్రాంతాలను ఎంపిక చేసుకునే సదుపాయం కల్పిస్తుంది. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి పోస్టింగ్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు విధివిధానాలను తయారు చేసిందని సమాచారం. అభ్యర్థులు కోరుకుంటున్న మూడు ప్రాంతాల వివరాలను ఉన్నతాధికారులు తెలుసుకోవటం లేదా ఆన్ లైన్ లో నమోదు చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తారు. 
 
ఉద్యోగాలకు ఎంపికైన వారికి సాధ్యమైనంతవరకు మొదటి ప్రాధాన్యతగా ఎంపిక చేసుకున్న ప్రాంతాన్నే ఇవ్వటానికి అధికారులు ప్రయత్నిస్తారు. ఒక ప్రాంతంలో ఒకే పోస్టుకు ఎక్కువమంది పోటీ పడితే అలాంటి సందర్భాల్లో మాత్రం రెండు, మూడు స్థానాల్లో ఎంపిక చేసుకున్న ప్రాంతాలలో అవకాశం ఇవ్వటం జరుగుతుంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలలో ఎంపికైన వారికి ఈరోజు ఉదయం జిల్లా కేంద్రాలలో నియామక పత్రాలు అందజేస్తారు. 
 
నియామక పత్రాలు కేవలం అభ్యర్థి ఉద్యోగానికి ఎంపికైనట్లు  ఇచ్చే లెటర్ మాత్రమేనని, ఉద్యోగి విధుల్లో ఎక్కడ చేరతాడనే విషయాన్ని పోస్టింగ్ ఆర్డర్ లో తెలియజేస్తామని అధికారులు ప్రకటించటం జరిగింది. ఈరోజు ఉదయం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో కృష్ణా జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలను అందజేస్తారు. అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలకు ఎంపికైన వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినేందుకు వీలుగా అధికారులు టీవీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. 


 
 



మరింత సమాచారం తెలుసుకోండి: