ఇండియా పాక్ దేశాల మధ్య దాయాదుల పోరు ఎప్పుడు రసవత్తరంగానే ఉంటుంది.  రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ పోటీలు అంటే క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగే అని చెప్పాలి.  రెండు దేశాల మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయి అంటే.. తమ సత్తా ఏంటో చూపించేందుకు రెండు దేశాలు సాయశక్తులా కృషి చేస్తాయి.  అది క్రికెట్ మ్యాచ్ లా ఉండదు.. ఒక యుద్ధంలా ఉంటుంది.  రెండు దేశాల మధ్య యుద్ధంగా అభిమానులు భావిస్తుంటారు.  


ఏ జట్టు ఓడిపోయినా దాన్ని స్పోర్టింగ్ స్పిరిట్ గా తీసుకోరు.  సీరియస్ గా తీసుకుంటారు.  ఆ తరువాత జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.  అందుకే, రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది. గత కొంతకాలంగా రెండు దేశాల మధ్య మ్యాచ్ లు జరగడంలేదు.  కారణం ఉద్రిక్తకరమైన పరిస్థితులు.  ఇక పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితుల కారణంగా అక్కడ మ్యాచ్ లు ఆడేందుకు ఏ దేశము ముందుకు రావడం లేదు.  


రీసెంట్ గా శ్రీలంక ఆ దేశంలో మ్యాచ్ లు ఆడేందుకు ముందుకు వచ్చింది.  ప్రస్తుతం శ్రీలంకతో పాక్ మ్యాచ్ ఆడుతున్నది.  ఇక వచ్చే ఏడాది ఆసియా కప్ మ్యాచ్ లు జరగాల్సి ఉంది.  వాటిని పాక్ లో నిర్వహించాలని అనుకుంటోంది ఐసీసీ.  కానీ, పాక్ లో ఉన్న సమస్యల దృష్ట్యా ఇండియా అందుకు ఒప్పుకోకపోవచ్చు.  ఇండియా నిర్ణయం కోసం వచ్చే ఏడాది జూన్ వరకు వెయిట్ చేస్తామని పాక్ చెప్తున్నది.  ఒకవేళ పాక్ లో మ్యాచ్ లు జరిగేందుకు ఇండియా ఒప్పుకోకపోతే.. పాక్ లో మ్యాచ్ లు నిర్వహించడం చాలా కష్టం అవుతుంది.  


ఇండియాలో మ్యాచ్ లు నిర్వహించినా తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పాక్ చెప్తున్నది.  లేదు తటస్థ వేదికపై నిర్వహించినా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అంటోంది. ఎదో ఒక విషయాన్నీ ఇండియా త్వరగా చెప్పాలని ఐసిసిని కోరింది పాక్.  ఆ విధంగా ఐసిసిపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది.  ఆసియా కప్ లో ఇండియానే లీడ్ చేస్తుంది.  పాక్ లో ఆడేందుకు ఇండియా కాదంటే దానికి అనుగుణంగా బాంగ్లాదేశ్ కూడా సిద్దపడదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: