పాక్ కు ఇప్పటికే ఐరాసలో దెబ్బ పడింది.  ఐరాసలో ఇండియాపై విషం కుక్కలని చూసింది.  కానీ, ఆ విషయం తిరిగి పాక్ నెత్తిన పడింది.  బతుకు జీవుడా అంటూ పాక్ ప్రధాని తిరిగి పాక్ చేరుకున్నారు.  అయితే, పాకిస్తాన్ మిత్రులకు కూడా అక్కడ చేదు అనుభవమే ఎదురైంది.  పాక్ చిరకాల మిత్రుడు చైనా పాక్ కు సపోర్ట్ గా మాట్లాడినా దాని గురించి ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.  ఐరాస బయట బలూచ్, సింధ్ ఉద్యమకారులు పాక్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు పట్టుకొని నానాయాగీ చేశారు.  


ఇది ఆ దేశానికీ మాయని మచ్చ అని చెప్పొచ్చు.  అంతేకాదు, బలూచ్ ఉద్యమకారులను కొంతమంది పాక్ అనుకూలురు అడ్డుకొని గొడవడుతున్న సమయంలో అక్కడి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  ఇదిలా ఉంటె, పాక్ కు మరో మిత్రదేశం సౌదీ అరేబియాకు పాక్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి.  ఇండియా ఇస్లామిక్ తీవ్రవాదం అని అంటోందని, ప్రపంచదేశాలు కూడా ఇస్లామిక్ తీవ్రవాదం అని అంటున్నాయని దీనిపై ఇస్లామిక్ దేశాలు ఒక్కటిగా మరి వాటిని ఎదిరించాలని పాక్ ప్రధాని కోరారు.  


కానీ, ఏ దేశము దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోలేదు.  ముఖ్యంగా సౌదీ అరేబియా కూడా సీరియస్ గా తీసుకోలేదు.  పైగా ఐరాస సర్వసభ్య దేశాల సమావేశాలు ముగిసిన వెంటనే.. సౌదీ ఇండియా 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది.  ఇప్పటికే రిలయన్స్ తో 40 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదిరించి.  ఒక్క చమురు, పెట్రో రంగాల్లోని కాకుండా, మౌలిక రంగం ఇతర రంగాల్లో కూడా ఇండియాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆ దేశం ప్రకటించింది.  


అంతేకాదు, సౌదీ అత్యున్నత పురస్కారం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశం అందించిన సంగతి కూడా తెలిసిందే.  తీవ్రవాదం ఎక్కడ ఉన్నా దానిపై అందరు కలిసి పోరాటం చేయాలి అని చెప్పిన మోడీ మాటకు కట్టుబడి, మోడీతో కలిసి పనిచేసేందుకు అన్ని దేశాలు ముందుకు వస్తున్నాయి.  సౌదీ అరేబియా సైతం ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడంతో పాక్ షాక్ తిన్నది.  పాక్ కు సౌదీ అత్యంత స్నేహం ఉంది.  కానీ, ఆ స్నేహం కొంతవరకే అని వ్యాపారం విషయంలో కాదని మరోమారు రుజువైంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: