ఆగష్టు 15 వ తేదీ నుంచి గ్రామవాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ లో అందుబాటులోకి వచ్చారు.  వీరంతా గ్రామాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారు.  ప్రతి 50 కుటుంబాలకు ఒకరు చొప్పిన గ్రామవాలంటీర్లు పనిచేస్తున్నారు.  అయితే, గ్రామవాలంటీర్ల సంస్థ వలన ఉపయోగం లేదని, గ్రామవాలంటీర్ల పేరుతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారని బాబు గతంలో మండిపడిన సంగతి తెలిసిందే.  కార్యకర్తలకు పనులు కల్పించేందుకు జగన్ పార్టీ చేసిన పధకం మాత్రమే ఇది అని పేర్కొన్నారు.  


దీనిపై వైకాపా పార్టీ నేతలు ధీటుగా స్పందించారు.  కౌంటర్ ఇచ్చారు.  అయితే, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజిని బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.  గ్రామవాలంటీర్ల వ్యవస్థ బాగాలేదని, వారి వలన ఉపయోగం లేదని బాబుకు షాక్ ఇచ్చేందుకు ఓ ఫోటోను రిలీజ్ చేసింది.  ధర్మసాగరంకు చెందిన బొయిలమ్మా అనే గ్రామవాలంటీర్ స్పృహతప్పి పడిపోయి ఉన్న ఓ అనాథను 108 వాహనంలో ఎక్కించేందుకు సహాయం చేస్తున్న ఫోటో అది.  ఆ ఫోటోను రిలీజ్ చేసి.. ఇది గ్రామవాలంటీర్ సత్తా అంటే అని పేర్కొన్నది.  


సత్తా ఉన్న వ్యక్తులు గ్రామవాలంటీర్లు అని.. కేవలం ప్రజలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇలా సేవా రంగంలో కూడా గ్రామవాలంటీర్లు చురుగ్గా పాల్గొంటున్నారని, ఈ విషయం తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని బాబుకు హితవు పలికింది విడదల రజిని.  గ్రామవాలంటీర్ వ్యవస్థ బాగాలేదని, కించేపరిచే విధంగా ఉన్నాయని చెప్పడం బాబు తెలివికి నిదర్శనం అని, 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదని గతంలో వైకాపా నేతలు పేర్కొన్నారు.  


కాగా, గ్రామవాలంటీర్లకు అక్టోబర్ 1 వ తేదీన వారి జీతాలు వారి ఖాతాలో వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.  అక్టోబర్ 2 వ తేదీ నుంచి గ్రామసచివాలయ ఉద్యోగులు అందుబాటులోకి వస్తారు.  గ్రామాలకు సంబంధించిన అన్ని విషయాలను గ్రామసచివాలం చూసుకుంటుంది.  ఇలా చేయడం వలన గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం అవుతుందని, తద్వారా యువతకు ఉద్యోగం కల్పించినట్టు అవుతుంది.  జగన్ చెప్పినట్టుగా వచ్చిన మూడు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు కల్పించి శభాష్ అనిపించుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: