పండగ వేళ,పిల్లాపాలతో ఏంచక్కా ఊరెళ్లి రావచ్చనుకుంటున్న ప్రయాణికులకు పిడుగులాంటి వార్తను తెలంగాణ ఆర్టీసీ తెలిపింది.ఈ వార్త ప్రజలకే కాదు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇరుకున పెట్టింది.అదేమంటే అక్టోబర్‌ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎంతో కాలంగా వారు డిమాండ్‌ చేస్తున్న విషయం తెలిసిందే.



ఇక తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ,సెప్టెంబర్‌ 3న ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు లేఖ కూడా రాశారు.దీంతోపాటు 11 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉంచారు.కానీ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో సమ్మెబాట పట్టారు.ఇప్పటికే స్కూళ్లు,కాలేజీలకు దసరా సెలవులను విద్యాసంస్థలు ప్రకటించాయి. ఈ క్రమంలో ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ప్రజలకు,కార్మికులు సమ్మెబాట పట్టడంతో ప్రయాణాలు ఎలాచేయాలనే భయం పట్టుకుంది.అసలే దసరా పండగా,ఈ పండగకు జనం ప్రవాహాంలా పోటెత్తుతారు.ఈ సమయంలో ప్రయాణమంటేనే ఇండియా పాకిస్ధాన్ మ్యచ్‌లా ఉంటుంది.ఇటువంటి సమయంలో,సమ్మె చేస్తున్నామని ఆర్టీసీ కార్మికులు తెలుపడం నిజంగా తలనొప్పి వ్యవహారం అని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.



ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతు ప్రభుత్వం,తమ సమస్యలను పట్టించుకోలేదని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీనిచ్చి సీఎం కేసీఆర్ మాట తప్పారని, తమ సమస్యలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.ఇక ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోపాటు ఐఆర్,డీఆర్ వెంటనే ప్రకటించాలని వారు కోరుతున్నారు..గత ఐదేళ్లుగా ఆర్టీసీ రూ.5 వేల కోట్ల పైచిలుకు నష్టాలతో ఉందని,ఈ నష్టాలను వెంటనే పూడ్చాలని డిమాండ్ చేశారు. ఇక మరోవైపు ఆర్టీసీలో 7 వేల మంది కార్మికులు పదవీ విరమణ చేయగా వారిస్దానంలో కొత్తగా ఉద్యోగాలను నియమించడం లేదని దీనీవల్ల ఇప్పుడున్న వారిపై పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: