రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జనగన్మోహన్ రెడ్డి తిరుపతిలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ క్రమంలో  విమానాశ్రమం నుంచి నేరుగా తిరుచానూరు సమీపంలో నిర్మించిన శ్రీ పద్మావతి నిలయాన్ని ప్రారంభిస్తారు. టీటీడీ దీని నిర్వహణ బాధ్యతలను ఏపీ టూరిజానికి  అప్పగించనుంది. ఇందులో 200 గదులను నిర్మించారు. ఆ సాయంత్రం 4.15గంటలకు ‘అలిపిరి- చెర్లోపల్లె’ జంక్షన్‌లో నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.అనంతరం తిరుమలలోని  నందకం అతిథిగృహం వద్ద మాతృశ్రీ వకుళాదేవి యాత్రికుల వసతి సముదాయాన్ని ప్రారంభిస్తారు. దీనిని రూ.42.86 కోట్లతో.. ఐదు అంతస్తులతో.. 270 గదులతో టీటీడీ నిర్మించింది. అలాగే, రూ.79 కోట్లతో నిర్మించనున్న యాత్రికుల వసతి సముదాయానికి శిలాఫలకం ఆవిష్కరించి శ్రీపద్మావతి అతిథిగృహానికి చేరుకుంటారు



.బ్ర‌హ్మోత్స‌వాల మొద‌టి రోజు సీఎం వైఎస్‌.జ‌గ‌న్‌ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున తిరుమ‌ల శ్రీ‌వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పిస్తార‌ని, ఇందుకోసం ప‌టిష్ట ఏర్పాట్లు చేప‌ట్టామ‌ని టీ టీ  డి  ఈవో తెలిపారు. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ముఖ్యమంత్రి రేణిగుంట విమానాశ్ర‌యానికి చేరుకుంటార‌ని చెప్పారు. అక్క‌డి నుండి తిరుచానూరుకు చేరుకుని ప‌ద్మావ‌తి నిల‌యం యాత్రికుల వ‌స‌తి స‌ముదాయాన్ని ప్రారంభిస్తారని వివ‌రించారు. ఆ త‌రువాత శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ద‌ర్శించుకుంటారని చెప్పారు. అనంత‌రం నాలుగు వ‌రుస‌లుగా అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించిన అలిపిరి – చెర్లోప‌ల్లి రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేస్తారని తెలిపారు. శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్‌ జిల్లాకు వస్తున్నారు. తిరుపతి, తిరుమలలో రెండుచొప్పున ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు.




సీఎం పర్యటన సందర్భంగా అధికారులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. అనంతరం 7 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహన సేవలో పాల్గొని తిరుమలలో బస చేస్తారు. మంగళవారం ఉదయం 9.40 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.అంతకు ముందు టిటిడి నిఘా మ‌రియు భ‌ద్ర‌తా సిబ్బంది, ఎస్‌సిసి క్యాడెట్లు, స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు అయన అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్‌వో  గోపినాథ్ జెట్టి, అద‌న‌పు సివిఎస్వో  శివ‌కుమార్‌రెడ్డి, విఎస్‌వో  మ‌నోహ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: