సుప్రీంకోర్టులో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. అర్హులు, నిరుద్యోగులకు ఇది  శుభవార్తే. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ అర్హతతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ఆన్ లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ.. అక్టోబర్ 24

ఉద్యోగాల వివరాలు

మొత్తం ఖాళీల సంఖ్య: 53

పోస్టు

ఖాళీల సంఖ్య

సీనియర్ పర్సనల్ అసిస్టెంట్

35

పర్సనల్ అసిస్టెంట్

23

మొత్తం పోస్టులు

53



అర్హత: ఏదైనా డిగ్రీ ఉన్నవారు అర్హులు. కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు టైపింగ్ వచ్చి ఉండాలి. నిమిషానికి 40 పదాలు టైప్ చేయగలగాలి.

వయోపరిమితి: 01.09.2019 నాటికి సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 32 సంవత్సరాలు, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకు 27 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.150 చెల్లించాలి. ఆన్‌లైన్ విధానంలోనే ఫీజు చెల్లించాలి.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, షార్ట్‌హ్యాండ్ (ఇంగ్లిష్) టెస్ట్, టైపింగ్ స్పీడ్ టెస్ట్ (కంప్యూటర్), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

పేస్కేలు: సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ రూ.47,600. పర్సనల్ అసిస్టెంట్ రూ.44,900

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 28-9-2019
  • ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 24-10-2019

 

Notification

Online Application - Senior Personal Assistant (SPA)

Online Application - Personal Assistant (PA)

 


మరింత సమాచారం తెలుసుకోండి: