మనదేశంలో చట్టాలు ఉన్నా వాటిని పట్టించుకునే వ్యక్తులు ఉండరు.  నడిపోతుంది కదా అలా నడవని.. దాని గురించి ఎందుకు పట్టించుకోవాలి.. అలా వదిలేద్దాంలే అనుకోని పనిచేసుకుంటూ పోతారు.  అలా చేయడం వలన అనేక ఇబ్బందులు తలెత్తుతాయి.  చట్టాలు కఠినంగా అమలు చేయకుంటే.. దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది.  అందుకే మనదేశంలో అన్ని రకాల వనరులు ఉన్నా వాటిని అమలు చేయడంలో మాత్రం మనం ముందు ఉండలేకపోతున్నాము.  చట్టాలు కఠినంగా లేకపోవడంతోనే ఎవరికీ నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు క్రైమ్ రేట్ పెరిగిపోతున్నది.  


కానీ, సౌదీలో అలాకాదు.  అక్కడి చట్టాలకు లోబడే ప్రతి ఒక్కరు పనిచేయాలి.  చట్టాలకు లోబడి నడుచుకోవాలి.  లేదంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది.  ఇతరదేశాల నుంచి పనిచేసేందుకు సౌదీ వెళ్లిన వ్యక్తులు కూడా అక్కడి చట్టాలకు అనుగుణంగానే నడుచుకోవాలి.  లేదంటే ఇబ్బందులు తప్పవు.  ఇదిలా ఉంటె సౌదీ ఇటీవలే టూరిస్టులకు ఆహ్వానం పలికింది.  ప్రపంచంలోని 49 దేశాలకు చెందిన వ్యక్తులు ఆ దేశంలో పర్యటించేందుకు అనుమతులు మంజూరు చేసింది.  


అయితే, అనుమతులతో పాటు కొన్ని నియమాలను కూడా ప్రకటించింది.  అక్కడి చట్టాల ప్రకారమే టూరిస్టులు నడుచుకోవాలని పేర్కొన్నది.  చట్టాలను అతిక్రమిస్తే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని పేర్కొన్నది.  చట్టం ముందు అందరు సమానమే అని, పొట్టి దుస్తులు, బిగుతైన దుస్తులు వేసుకోవడానికి వీలులేదని చెప్పింది.  ముఖ్యంగా మజీద్ వంటి వాటి దగ్గర అలంటి డ్రెస్ లకు అనుమతి లేదని, సౌదీ మహిళలు వేసుకునే విధంగానే డ్రెస్ చేసుకోవాలని పేర్కొన్నది.  


అంతేకాదు, బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం నేరం అని కూడా పేర్కొన్నది.  మొత్తం 19 షరతులతో కూడిన నియమాలను సౌదీ ప్రభుత్వం విడుదల చేసింది.  ఆ నియమాలకు లోబడే టూరిస్టులు అక్కడ తిరగాల్సి ఉంటుంది.  సో, సౌదీని సందర్శించాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా ఆ నియమాలకు లోబడే వెళ్ళాలి.  లేదంటే.. భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది.  కాబట్టి ఆ దేశం వెళ్లే సమయంలో కాస్త ఇవ్వన్నీ గుర్తు పెట్టుకొని వెళ్తే బాగుంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: