దసరా శరన్నవరాత్రుల ఉత్సవాల్లో ఈరోజు రెండొవ రోజు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ ఈరోజు జగన్మాత దుర్గ దేవి బాలాత్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆవహించి ఉండే శక్తి స్వరూపమే త్రిపుర అని త్రిపురతాపినీ ఉపనిషత్తు చెబుతోంది.                                  


''స్వర్గ, భూ, పాతాళం'' అనే త్రిపురలో ఉండే శక్తి చైతన్యాన్ని త్రిపురగా వర్ణిస్తారు. కాగా త్రిపురుని భార్య త్రిపుర సుందరీదేవి అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్ధం. శ్రీచక్రంలో ఉండే తొమ్మిది అమ్నయాల్లో మొదటి అమ్నయం త్రిపురసుందరీదేవియే. విద్యలో మొదటి విద్య బాల అంటే 'శ్రీ' అందుకే ఆధ్యాత్మిక విష్యను సాధన చేసేవారు మొదట బాల మంత్రాన్ని చదువుతారు.                           


కాగా అభయ హస్త ముద్రతో అక్షరమాల ధరించిన త్రిపుర సుందరిను ఆరాధిస్తే మనో వికారాలు తొలగి పోతాయి. మనసు, బుద్ధి అహంకారం త్రిపుర సుందరి అధీనంలో ఉంటాయి. త్రిపుర సుందరి ఆరాధిస్తే అన్ని బాధలు తొలిగిపోయి సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. త్రిపుర సుందరి దేవిని అరుణవర్ణ వస్త్రాలు ధరించి యెర్రని పూలతో పూజ చేస్తారు.                        

                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: