చంద్రబాబునాయుడుకు ఆడవాళ్ళంటే ఎంత చులకనగా ఉందో అందరికీ అర్ధమవుతోంది. ఆడవాళ్ళను ఉద్దేశించి తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. గ్రామవాలంటీర్ల వ్యవస్ధపైన కూడా చంద్రబాబు చవకబారు వ్యాఖ్యలు చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా తన భుజాన్ని తానే చరుచుకునే చంద్రబాబు ఇంత చీప్ వ్యాఖ్యలు చేస్తారని ఎవరూ ఊహించలేదు.

 

గ్రామ వాలంటీర్ల గురించి మాట్లాడుతూ ఇంట్లో మగాళ్ళు లేనపుడు వాలంటీర్లు వెళ్ళి తలుపులు తట్టటం ఏమిటండి ? అంటూ చాలా చీప్ గా మాట్లాడారు. మగాళ్ళు లేపుడు వాలంటీర్లు వెళ్ళి తలుపులు తడుతున్నారంటే అంటే అర్ధమేంటి ? అంటే ఇంట్లోని ఆడవాళ్ళతో వాలంటీర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే కదా అర్ధం ? మరి అదే నిజమైతే ఈ విషయం తెలిసిన తర్వాత తమ ఆడవాళ్ళ విషయంలో మగవాళ్ళు ఎలా రియాక్టవుతారో చంద్రబాబుకు తెలీదా ?

 

పోనీ చంద్రబాబు చెప్పిందే నిజమనుకున్నా ఇంతవరకూ ఏ వాలంటీర్ పైనా ఏ ఇంట్లో ఆడవాళ్ళు కూడా కంప్లైంట్ చేయలేదే ? మరి ఎవరూ కంప్లైంట్ చేయకుండానే చంద్రబాబు అలా ఎలా వ్యాఖ్యలు చేస్తున్నారు. మగాళ్ళు లేనపుడు తలుపులు తట్టటమంటే ఒక్క వాలంటీర్లే కాదు కూరల వాళ్ళు, పాలవాళ్ళు, పప్పులు, ఉప్పులు అమ్ముకునే వాళ్ళు, కొరియర్  బాయ్స్, పోస్టుమ్యాన్ ఇలా ఎంతో మంది తలుపులు తడతారని చంద్రబాబుకు తెలీదా ?

 

అసలింతకూ వాలంటీర్ల వ్యవస్ధ గురించి చంద్రబాబు ఏమి చెప్పదలచుకున్నారు ? లోపాలు లేని వ్యవస్ధలు ఏమిఉన్నాయి ? కాకపోతే సమస్యలు వచ్చినపుడు, లోపాలు బయటపడినపుడు సర్దుబాటు చేసుకుంటూ ముందుకెళ్ళాలంతే. అలాగే ఏపని చేసినా తప్పులు పట్టే చంద్రబాబు లాంటి వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్లు, గ్రామసచివాలయాలు గనుక బలోపేతమై మంచి పేరు తెచ్చుకుంటే టిడిపికి భవిష్యత్తంతా చీకటే. ఇదే చంద్రబాబులోని అసలు భయం. అందుకనే జనాలను ప్రభుత్వంపై రెచ్చ గొడొతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: