రోజుకు రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి.ఆ ప్రమాదాల్లో గాయపడే వారు కొందరైతే,ప్రాణాలు కోల్పోయే వారు మరికొందరు.ఇది నిర్లక్ష్యపు డ్రైవింగ్ అనుకోవాలా, వాహనాలను నడిపే సామర్థ్యం లేకపోవటం అని ఆలోచించాలా.ఏది ఏమైన జరిగిన నష్టం మాత్రం ఎవరు పూడ్చలేరు.ఇక వాహనచోదకుల భద్రత దృష్ట్యా ఎన్ని అవగాహన సదస్సులు నిర్వహించినా, పోలీసు, రవాణా శాఖలు ఎన్ని చర్యలు తీసుకున్నా పరిస్థితి అదుపులోకి రావటం లేదు. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను మరింత కఠినం చేయాలని రవాణా శాఖ నిర్ణయించింది.



దరఖాస్తుదారుడికి కచ్చితంగా వాహనాన్ని నడిపే సామర్థ్యం ఉన్నట్టు రుజువైతేనే లైసెన్స్ జారీ చేస్తామని తెలిపింది.ఎందుకంటే డ్రైవింగ్ లైసెన్సుల కోసం వస్తున్న చాలామందిలో నైపుణ్యం ఉండడం లేదు.గతంలో లైసెన్సుల జారీ ఎలా జరిగినా..ఇకపై పకడ్బందీగా జారీ చేయాలని  నిర్ణయించింది.ఇక ఇప్పటినుండి డ్రైవింగ్‌‌‌‌ లైసెన్స్‌‌‌‌ పొందడం,అంత ఈజీ యేం కాదు.బండి నడపడంలో కాస్త తడబడి అటు ఇటైతే టెస్ట్‌‌‌‌ ఫెయిలయ్యే చాన్స్‌‌‌‌ ఉంది.ఎందుకంటే వాహనదారుడి ప్రతి కదలికను పసిగట్టే హైటెక్నాలజీ వున్న సెన్సర్లతో లైసెన్స్‌‌‌‌ పరీక్ష నిర్వహించనున్నారు.త్వరలోనే ఈ విధానం అన్నిం ఆర్టీవో ఆఫీసుల్లోకి రాబోతోంది.



ఈ సెన్సర్‌‌‌‌ ఆధారిత సీసీ కెమెరాలు,డ్రైవింగ్‌‌‌‌ ట్రాక్‌‌‌‌పై 25 నుంచి 30 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేస్తారు.అప్పుడు డ్రైవర్‌‌‌‌ ట్రాక్‌‌‌‌పైకి వచ్చినప్పటి నుంచి బయటకెళ్లే వరకు అన్ని కదలికలను ఈ కెమెరాలు బంధిస్తాయి. పరీక్ష టైంలో డ్రైవర్‌‌‌‌ బండి ఎలా నడిపాడు,వెహికల్‌‌‌‌ ఎన్ని సార్లు ఆగింది, డ్రైవింగ్‌‌‌‌లో లోపాలున్నాయా? లాంటివి సెన్సర్‌‌‌‌ ఆధారిత సీసీ కెమెరాలతో ఈజీగా తెలుసుకోవచ్చు.అంతేకాకుండా ఈ సెన్సింగ్‌‌‌‌ కెమెరాల డేటా ఆధారంగా బండి నడిపిన విధానాన్ని బట్టి ఆటోమేటిక్‌‌‌‌గా మార్కులు పడతాయి..సో ఇప్పటి నుండి వాహనాలను చాలా జాగ్రత్తగా నడిపే వారికే లైసెన్స్‌లు వస్తాయన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: