అవును ఇంతటి గౌరవం గతంలో  ఏ రాజకీయ కుటుంబానికి దక్కలేదన్నది నిజమే. ఇంతకీ అంతటి అరుదైన గౌరవం ఏమిటంటే తండ్రి, కొడుకులిద్దరూ తిరుమల తిరుపతి దేవస్ధానం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటమే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐదేళ్ళు పట్టువస్త్రాలు సమర్పించిన విషయం అందరికీ తెలిసిందే.

 

అదే పద్దతిలో ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు అంటే సోమవారం రాత్రి తిరుమలలోని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిచబోతున్నారు. జగన్ సిఎం అయిన తర్వాత మొదటి బ్రహ్మోత్సవాలు ఆరంభమవుతోంది. అందుకని సోమవారం సాయంత్రానికి తిరుమల చేరుకుంటున్నారు.

 

ఒకే ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించటమనే అరుదైన ఘట్టం లేకపోతే అదృష్టం గతంలో ఏ రాజకీయ కుటుంబానికి దక్కలేదన్నది వాస్తవం. ఎందుకంటే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారు చాలామందే ఉన్నారు. అయితే వారి సంతానంలో ఇంకెవరూ వాళ్ళ తర్వాత ముఖ్యమంత్రులు కాలేదు. కాబట్టి ఆ అవకాశాం ఏ రాజకీయ కుటుంబానికి దక్కలేదు.

 

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సిఎం అయినా ఆయన తండ్రి అమరనాధరెడ్డి కేవలం మంత్రిగా మాత్రమే పనిచేశారు. మచిలీపట్నం ఎంఎల్ఏగా పనిచేసిన పేర్ని కృష్ణమూర్తి మంత్రిగా పనిచేశారు. ఇపుడు ఆయన కొడుకు పేర్ని నాని మంత్రిగా ఉన్నారు. సిఎంగా పనిచేసిన కోట్ల విజయభాస్కరరెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేంద్రంలో మంత్రిగా పనిచేశారు.

 

గతంలో సిఎంలుగా పనిచేసిన నేతల వారుసుల్లో చాలామంది పెద్దగా యాక్టివ్ గా కూడా లేరనే చెప్పాలి. చంద్రబాబునాయుడు, లోకేష్ మాత్రమే రాజకీయాల్లో ఒకే సమయంలో యాక్టివ్ గా ఉన్నారంతే. కాబట్టి వైఎస్సార్, జగన్ లకు మాత్రమే ఇటువంటి అరుదైన అదృష్టం దక్కింది. భవిష్యత్తులో ఇటువంటి అదృష్టం దొరికితే చంద్రబాబు కుటుంబానికి మాత్రమే దక్కే అవకాశం ఉంది. లేకపోతే ఇంకెవరికీ దక్కదనే  చెప్పాలి. ఎందుకంటే ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి వారసుల కోసం వెతికితే యాక్టివ్ గా ఉండే వారే చాలా తక్కువ.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: