అక్టోబర్ వస్తూ వస్తూ వరసగా పండుగలను తీసుకొచ్చింది.  పండుగలతో పాటు బ్యాంకు సెలవులను కూడా తీసుకొచ్చింది.  అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతితో మొదలయ్యే సెలవులు.. 30 రోజుల్లో 11 రోజులపాటు మూతపడబోతున్నాయి. 11 రోజులు మూతపడటం అంటే మామూలు విషయం కాదు.  చాలా కష్టమైన విషయంగా చెప్పాలి. అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉంటుంది.  అంతేకాదు.. అది పబ్లిక్ హాలిడే కాబట్టి ఆరోజున అన్ని కార్యాలయాలు బంద్ ఉంటాయి. 


దీంతో పాటు అక్టోబర్ 6 వ తేదీ ఆదివారం అయ్యింది.  ఆరోజు ఎలాగో సెలవే.  అక్టోబర్ 7 వ తేదీన మహార్నవమి .  ఆరోజు బ్యాంకులకు సెలవు ఉన్నట్టు తెలుస్తోంది.  అక్టోబర్ 8 దసరా.  పబ్లిక్ హాలిడే.  కాబట్టి ఆరోజు బ్యాంకులు పనిచేయవు.  పదో తేదీలోపే నాలుగు రోజులు సెలవులు వచ్చాయి.  అంటే కేవలం ఆరు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తాయి.  


ఇక ఇదిలా ఉంటె, సెకండ్ వీక్ లో అక్టోబర్ 12 వ తేదీ రెండో శనివారం వచ్చింది.  ఆ తరువాత రోజు అక్టోబర్ 13 ఆదివారం.  ఈ రెండు రోజులు వరసగా బ్యాంకులు పనిచేయవు.  దీంతో పాటు అక్టోబర్ 20 వ తేదీ ఆదివారం.  ఎలాగో హాలిడేనే.  ఆ తరువాత అక్టోబర్ చివరి వారం విషయానికి వస్తే అక్టోబర్ 26 నాలుగో శనివారం అయ్యింది.  ఆరోజు హాలీడే.  బ్యాంకులు పనిచేయవు.  అలానే అక్టోబర్ 27 ఆదివారం పైగా దీపావళి.  అలానే అక్టోబర్ 29 భాయ్ దూజ్.  ఆరోజు కూడా బ్యాంకులు పనిచేయవు.  సో, అక్టోబర్ నెలలో మొత్తం 11 రోజులు బ్యాంకులు పనిచేయవన్నమాట.  


కాబట్టి వినియోగదారులు బ్యాంకు ఖాతా విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  తమ ఖాతాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు వహిస్తూ.. అన్ని సక్రమంగా చూసుకుంటే ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదు.  బ్యాంకులకు 11 రోజులు హాలిడేస్ అంటే మాములు విషయం కాదు కదా.  మాములు ప్రజలే కాదు.. అటు ఆర్థికరంగ వ్యవస్థ కూడా ఇబ్బంది పడుతుంది. బ్యాంకులపై ఆధారపడి షేర్లు ఆ సమయంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: