వాన రాకడ..ప్రాణం పోకడ ఎవ్వరూ చెప్పలేరు.  తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. దసరా, దీపావళి సందర్భంగా బాణా సంచా తయారీ పెరిగిపోయింది.  అయితే ప్రభుత్వం యాజమాన్యానికి భద్రతా నియమాలు పాటించాలని ఎన్నిసార్లు సూచించినా కొన్ని చోట్ల నిర్లక్ష్యంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.


ఇటీవల సూర్యపేట వద్ద ఘోర దుర్గటన జరిగి ఒకరి ప్రాణం పోయింది.  తాజాగా సామర్లకోట మండలం మేడపాడు గ్రామంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకొని క్షతగాత్రులను వెంటనే కాకినాడ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ప్రమాదంలో గాయపడిన ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇక తమిళనాడు బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.  విల్లుపురం జిల్లాలో భారీ పేలుడు ధాటికి ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: