ప్రాణం పోయాల్సిన డాక్టర్లే ప్రాణాలు తీసే రోజులు వచ్చాయి. మా పిల్లలకు వైద్యం చెయ్యండి అయ్యా బాబు అని వస్తే పార్మాకంపెనీలతో కలిసి ఆ పిల్లలపై ప్రయోగాలు చేసి చంపుతున్నారు. అసలు వీరు మనుషుల అనే సందేహం వచ్చేలా చేస్తున్నారు. ఈ ప్రయోగాలు ఎప్పటి నుండో పిల్లలపై చేస్తున్నారు. అయితే అదే ప్రయోగాలు చేసే ఇద్దరు డాక్టర్లకు విబేధాలు రావడంతో జరిగిందంతా పూస గుచ్చినట్టు బయటకు వచ్చింది.                                  


ఇదంతా జరిగింది నిలోఫర్‌ ఆస్పత్రిలోనే. అయితే ఈ ఆసుపత్రిపై ఔషధ ప్రయోగాల అంశంపై వైద్యవిద్య సంచాలకులు నియమించిన త్రిసభ్య కమిటీ ప్రాథమిక విచారణ ముగిసింది. దాదాపు 3 గంటలపాటు నిలోఫర్‌ ఆస్పత్రి ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సూపరింటెండెంట్‌లను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అనంతరం ప్రాథమిక విచారణ నివేదికను డీఎంఈకి అందజేయనున్నారు.                                  

                

నిలోఫర్‌లో ఔషధ ప్రయోగాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి కూడా ఆరా తీసిన విషయం తెలిసిందే. సమగ్ర వాస్తవ నివేదికను అందజేయాలని ఆయన నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. మరి నివేధిక ఎలా వస్తుంది ? అసలు ఆ ఆసుపత్రిలో ఎం జరుగుతుంది అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా వైద్యం చెయ్యమని వస్తే ప్రయోగాలు చెయ్యడం ఘోరం.                          

                     

మరింత సమాచారం తెలుసుకోండి: