"చాలా ఏళ్లపాటు క్రమంగా పెరుగుతూ వచ్చిన వృద్ధి రేటు స్వల్పకాలం పాటు నెమ్మదిస్తుంది. సాధారణంగా 6-10 ఏళ్ల పాటు పెరుగుతూ వచ్చాక 6 నెలల నుంచి 2 ఏళ్ల పాటు వృద్ధి జోరు తగ్గుతుంది" ఇది సహజంగా జరిగే ఆర్ధిక సర్దుబాటు అని వివిధ దేశాల ఎకనమిక్ సైకిల్స్ సూచిస్తూ ఉంటాయి  

Image result for economic downturn characteristics 

ఆర్ధిక మాంద్యం లక్షణాలు

*నింగినంటే బంగారం ధర...బంగారం ధర కొండెక్కింది 
*స్టాక్ మార్కెట్స్ పతనం...కనిపిస్తూనే ఉంది 
*వాహనాల అమ్మకాలకు డిమాండ్ ధారుణంగా పడిపోవటం...ఆటోమొబైల్ అమ్మకాలు 40% వరకు పతనమయ్యాయి  
*విలువైన వస్తువుల కొనగోలు ఆలోచనలు వాయిదాలు వేయటం...రిటైల్ బిజినెస్ చూస్తే తెలుస్తూనే ఉంది 
*రూపాయి విలువ అంతర్జాతీయంగా నేల చూపులు చూడటం...ఫారిన్ ఎక్చేంజ్ దరవరలు గమనిస్తే అర్ధమౌతుంది
*బిస్కెట్ల నుండి కార్ల వరకు కొనగోలు చేయటానికి వినియోగదార్లు తొందర పడకపోవటం...బ్రిటానియా బిస్కెట్ కంపనీ ఎండి వరుణ్ బెర్రి ఉవాచ   
*ఎన్ బి ఎఫ్ సి లకు ఋణం లభించకపోవటం ... హెచ్డిఎఫ్సి చైర్మాన్ దీపక్ పరేఖ్ ఇప్పటికే చెప్పేశారు  
*గృహ ఋణాలకు బ్యాంక్ ఋణాలు లభించక పోవటం ... హెచ్డిఎఫ్సి చైర్మాన్ దీపక్ పరేఖ్ ఇప్పటికే చెప్పేశారు  

Image result for economic downturn characteristics

ఆర్థిక మాంద్యం నిర్వచనం:

ఏదైనా ఒక ఆర్ధిక సంవత్సరంలో వరుసగా 2-3 త్రైమాసికాలపాటు జీడీపీ వృద్ధి క్షీణిస్తూ పోతుంటే ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకున్నట్లుగా పరిగణిస్తారు. భవిష్యత్‌ పై నమ్మకం సడలిన కారణంగా వినియోగదారులు కొనుగోళ్లు తగ్గించడం వల్ల వ్యవస్థ ఆర్ధిక మాంద్యంలోకి జారిపోతుంది. తద్వారా మార్కెట్లో వస్తు, సేవలకు డిమాండ్‌ తగ్గుతుంది. ఫలితంగా కంపెనీలు, పరిశ్రమలు తమ ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వచ్చి భారీ సంఖ్యలో ఉద్యోగాలకు కోతపెడుతుంటాయి. అంటే నిరుద్యోగం అన్ని రంగాల్లో ప్రభలుతుంది ఆర్థిక వ్యవస్థలో పరిణామాలకు, స్టాక్‌ మార్కెట్‌ కు అవినాభావ సంబంధం ఉంది. మందగమన ప్రభావంతో వ్యాపారం తగ్గితే స్టాక్‌ మార్కెట్లో ఆ కంపెనీల షేర్ల ధరలూ క్షీణిస్తాయి. దాంతో మదుపర్ల సంపద కరిగిపోతుంది. ఈ పరిస్థితినే ఆర్థిక మాంద్యం అంటారు.

Image result for economic downturn characteristics

మరింత సమాచారం తెలుసుకోండి: