ఈ మధ్య కాలంలో విమానాలు ఎక్కాలంటే ప్రయాణికులు భయపడుతున్నారు. ఒకప్పుడు విమానం అంటే ఎగురుకుంటే వెళ్లే వారు ఇప్పుడు విమానం అంటే వెనకడుగు వేస్తున్నారు. దీనికి కారణం ఇటీవలే జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్స్, వాతావరణ మార్పులే కారణం. ఇంకా విషయానికి వస్తే గోవా నుండి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి పెద్ద ప్రమాదం తప్పింది.                                    

                   

180 మంది ప్రయాణికులతో పాటు ఆ విమానంలో గోవా పర్యావరణ మంత్రి, వారి అధికార బృందం కూడా ఉన్నారు. విమానం ఎడమవైపు ఇంజన్‌ ఫెయిల్‌ అయింది. అది గమనించిన పైలెట్ అప్రమత్తమయ్యి వెంటనే విమానాన్ని జాగ్రత్తగా కిందికి దించాడు. విమానం బయలేదేరేందుకు గాల్లోకి ఎగిరిన 20 నిమిషాల్లోనే ఎడమవైపు ఇంజన్‌లో మంటలు లేచాయి.               

                     

అది చూసి ప్రయాణికులు భయంతో పెద్దగా కేకలు పెట్టారు. పరిస్థితి గమనించిన పైలట్‌ అప్రమత్తమయ్యి విమానాన్ని వెంటనే సురక్షితంగా దించాడు. ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని మంత్రి కోబ్రాల్‌ అన్నారు. అందరిని మరో విమానంలోకి పంపి సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు చెప్పారు. కాగా ప్రమాదానికి సంబంధించి సిబ్బందిని విమానాశ్రయ అధికారులు నివేదిక కోరారు.                                    

                    

మరింత సమాచారం తెలుసుకోండి: