నల్గొండ జిల్లా హుజూర్ నగర్ ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు, రేవంత్ రెడ్డి కలిసి భారీ వ్యూహం పన్నుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు మొదలయ్యాయి. హుజూర్ నగర్ ఉపఎన్నికలో గెలవటం కాంగ్రెస్-టిఆర్ఎస్ లకు అత్యంత ప్రిస్టేజ్ గా మారిపోయింది. కాబట్టి గెలుపోటములకు ఎవరి వ్యూహాలు వారికున్నాయి.

 

అదే సమయంలో  పోటిలో ఉన్న  బిజెపి, టిడిపి, స్వత్రంత్రుల ప్రభావం నామమాత్రమే అని అనుకుంటున్నారు. వీళ్ళల్లో కూడా టిడిపి సొంతంగా అభ్యర్ధిని పోటిలోకి దించటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సరే గెలుపోటములపై ఎవరి వ్యూహాలు వారికున్నప్పటికీ చంద్రబాబు టార్గెట్ మాత్రం నేరుగా కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిని ఓడగొట్టటమనే వాదన బలంగా వినిపిస్తోంది.

 

కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతి ఓడిపోతే  చంద్రబాబుకు వచ్చే ఉపయోగం ఏమిటి ? ఏమిటంటే పద్మావతి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ ను కాంగ్రెస్ లోకి పంపిందే చంద్రబాబన్న విషయం తెలిసిందే.  రేవంత్ పిసిసి అధ్యక్షునిగా ఉంటేనే  కాంగ్రెస్ పై చంద్రబాబు పట్టు ఉంటుంది. అందుకనే ఈ ఎన్నికను అవకాశంగా తీసుకోవాలని చంద్రబాబు+రేవంత్ కలిసి ప్లాన్ చేస్తున్నారట. కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే రేవంత్ కే పిసిసి ప్రిసెడింట్ దక్కుతుందని ఆలోచిస్తున్నారట.

 

నిజానికి హుజూర్ నగర్ లో టిడిపి గెలిచే అవకాశం ఏమాత్రం లేదు. అయినా పోటి పెట్టారంటే కమ్మ సామాజికవర్గం ఓట్లు చీల్చచటం కోసమే అని సమాచారం. ఉపఎన్నిక కాబట్టి ఎవరు గెలిచినా పెద్ద మెజారిటి వచ్చే అవకాశాలు ఉండవు.  ఈ నేపధ్యంలో వెయ్యి, రెండు వేల ఓట్లు కూడా తీవ్ర ప్రభావం చూపిస్తుందనటంలో సందేహం లేదు. ఆ మేరకు టిడిపి కమ్మ ఓట్లు చీల్చుకుంటే చాలు కాంగ్రెస్ ఓడిపోవటానికి.

 

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఉత్తమ్ కు నియోజకవర్గంలో మంచి పట్టుంది. మంత్రిగా ఉన్న రోజుల్లో కూడా అవినీతి ఆరోపణలు లేవు. పైగా బాగా అభివృద్ధి చేశారనే పేరుంది. కాబట్టి ఎవరి వ్యూహం వర్కవుటవుతుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: