చంద్రబాబు రాజకీయాలతో విభేదించేవారైన కూడా ఆయన సీనియారిటీని గౌరవిస్తారు. చంద్రబాబు మూడు సార్లు ఏపీకి ముఖ్యమంత్రిగా చేశారు. జాతీయ స్థాయిలోనూ  పేరు తెచ్చుకున్నారు. ఆయన పాలనలో మంచి  చెడులు రెండూ ఉన్నాయి. ఏది ఏమైనా ఏపీలో ఓ అగ్ర నాయ‌కుడిగా బాబుని గుర్తిస్తారు. అటువంటి చంద్రబాబు తనకు లభిస్తున్న గౌరవం, తన సీనియారిటీకి తగిన విధంగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది.


విషయానికి వస్తే బాబు జగన్ తీసుకువచ్చిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థపైన ఇప్పటికే రకరకాలైన మాటలు అన్నారు. గ్రామ వాలంటీర్ల చేత రిక్షాలు తొక్కిస్తున్నారని, సంచీలు మోయిస్తున్నారని చులక‌న చేసే మాటలు అన్నారు. మరి బాబు వంటి వారికి తెలియదా డిగ్నిటీ ఆఫ్ లాబర్ గురించి అని వైసీపీ నేతల నుంచి వెంటనే సెటైర్లు  పడ్డాయి కూడా. అయినా తన విమర్శలను కొనసాగించిన బాబు గ్రామ వాలంటీర్లకు ఎవరూ పిల్లలను కూడా ఇవ్వరని ఘాటైన కామెంట్స్ చేశారు. దానికి రెస్పాండ్ అయిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీ అబ్బాయి లోకేష్ కి పెళ్ళి కాగా లేనిది కష్టపడి పనిచేసే వాలంటీర్లకు ఎందుకు కాదు బాబుగారూ అంటూ తగులుకున్నారు.


ఇవన్నీ పక్కన పెడితే మరింత దారుణమైన కామెంట్స్ ఇపుడు గ్రామ వాలంటీర్ల మీద బాబు చేశారు. ఓ విధంగా ఇది మహిళా లోకాన్ని సైతం కించపర‌చేలా ఉందని అంటున్నారు. మగాళ్ళు ఇంట్లో లేనపుడు గ్రామ వాలంటీర్లు వస్తారు అంటూ బాబు ఆపేసిన ఆ డైలాగ్ ని పూర్తిగా ఆలోచన చేస్తే ఇంతటి దారుణంగా ఓ సీనియర్ మోస్ట్ లీడర్ నోటి వెంట మాటలు వస్తాయా అని అనిపించకమాందని వైసీపీ నేతలు చెడుగుడు ఆడుకుంటున్నారు. ఇంట్లో మగాళ్లు లేనప్పుడు.. ఆడవాళ్లు మాత్రమే ఉన్నప్పుడు తలుపులు కొడతారు..' అంటూ చంద్రబాబు నాయుడు వెకిలి నవ్వుతో వ్యాఖ్యానించడం ఇపుడు రాజకీయ వర్గాల్లోనే  పెద్ద చర్చగావుంది.


బాబు ఇక్కడ గ్రామ వాలంటీర్లను విమర్శించబోయి గ్రామీణ ఆడపడుచులను కూడా తాను అనుమానిస్తున్నానన్న సంగతి మరచిపోతున్నారు. ఈ విధంగా గ్రామ వాలంటీర్లను అవమానించడం బాబుకు తగనది కూడా అంటున్నారు. ఇకపోతే బాబుకు తెలియాల్సిన విషయం మరోటి ఉందని అంటున్నారు. అదేంటి అంటే గ్రామ వాలంటీర్లు మొత్తంగా 2,48,608 మంది ఉంటే ఇందులో దాదాపు యాభై నాలుగుశాతం మంది మహిళలు ఉన్నారు. వారి సంఖ్య దాదాపు 1,30,718 మంది. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తే వాటి తీరేమిటో అర్థం చేసుకోవచ్చు.


మరి మహిళా గ్రామ వాలంటీర్లే ఎక్కువగా ఉన్న ఈ వ్యవస్థ మీద బాబు చేసిన ఈ కామెంట్స్ వెనక్కు తీసుకోవాలని కూడా డిమాండ్ వస్తోంది. అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్లుగా ఉంది బాబు వైఖరి అని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. తాను అధికారంలో ఉన్నపుడు జాబ్స్ లేకుండా చేసిన బాబు ఇపుడు వైసీపీ సర్కార్  లక్షల్లో పోస్టింగులు ఇస్తూంటే మాత్రం అసూయతో తన స్థాయి మరచి కామెంట్స్ చేయడం దారుణం అని కూడా అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: