మెట్రో రైల్ యాజమాన్యం ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేందుకు ఇకపై సెలవు దినాల్లో 50 శాతం ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని మెట్రో రైల్ యాజమాన్యం నిర్ణయించుకుందట. అయితే ఈ బంఫర్ ఆఫర్ హైదరాబాద్ లో కాదు చెన్నైలో. వివరాల్లోకి వెళ్తే చెన్నై ప్రజలు పని దినాల్లో మెట్రో ఎక్కినట్టు సెలువు దినాల్లో ఎక్కడం లేదట. 


చెన్నై మెట్రోలో రోజుకు సుమారుగా 1.2 లక్షల మంది ప్రయాణిస్తుండగా ఆదివారాలు, సెలవు దినాల్లో మాత్రం ఈ సంఖ్య అమాంతం 70 వేలకు పడిపోతోంది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మెట్రో యాజమాన్యం ఆదివారాలు, సెలవు దినాల్లో టికెట్ ధరపై 50 శాతం తగ్గింపును అమలు చేయాలని ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఈ డిస్కౌంట్ కొన్ని నెలల పాటు లేదా ఓ సంవత్సరం పాటు కొనసాగిస్తారని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు తుదిదశకు చేరుకోగా త్వరలోనే చెన్నై మెట్రో రైల్ బోర్డు ముందుకు చేరనున్నాయి. కాగా ఈ ఏడాది మొదట్లో చెన్నై మెట్రో రైలు నెలవారీ పాసులను అమల్లోకి తీసుకొచ్చి అచ్చం బస్సు పాసుల ఆ పాస్ ద్వారా ప్రయాణికులు ఎన్నిసార్లైనా ప్రయాణించేలా సౌకర్యం కల్పించింది. 


అయితే ఈ పాసులను పొందడానికి ప్రయాణికులు రూ.2500 చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఈ డిస్కౌంట్ ఆఫర్ చెన్నైకి మొదటి నుండి అలవాటే. 2017లో మెట్రో యాజమాన్యం ఓ వారం రోజుల పాటు 40 శాతం డిస్కౌంట్ అమలు చేయడంతో ప్రయాణికుల సంఖ్య 67 శాతం పెరిగింది. 2017 దీపావళి సందర్భంగా కూడా చెన్నై మెట్రో 20 శాతం డిస్కౌంట్ ఇచ్చింది. దీంతో ఇప్పుడు కూడా మెట్రో 50 శాతం డిస్కౌంట్ ఇస్తుంది అని ప్రజలు నమ్ముతున్నారు. మరి ఈ ఆఫర్ చెన్నై ప్రజలకు ఇస్తుందా ? లేదా అనేది చూడాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: