ప్రపంచంలో అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వాటిల్లో చమురు ఒకటి.  చమురు శుద్ది సంస్థలు ఎక్కువగా గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి.  ఇక్కడి నుంచి ఎక్కువగా చమురు ఉత్పత్తి అవుతుంది.  ఇక్కడ ఎలాంటి అలజడి జరిగినా దాని ప్రపంచం ప్రపంచంలోని పెట్రో ధరలపై పడుతుంది.  అందుకే చమురు ఉత్పత్తి చేసే దేశాలు ఇతర దేశాలతో యుద్ధాలను కోరుకోవు.  కారణం వ్యాపారం.  చమురు సంస్థలపై దీని ప్రభావం ఉంటె దాని వలన ఇబ్బందులు వస్తాయి.  


అయితే, ఇపుడు మిడిల్ ఈస్ట్ గల్ఫ్ లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.  సౌదీ అరేబియాకు, ఇరాన్ కు అసలు పడటం లేదు.  ఇరాన్ తో సంబంధాలు ఉన్న హుతి తీవ్రవాదులు సెప్టెంబర్ మొదటివారంలో సౌదీలోని అరాంకో చమురు శుద్ధి కేంద్రంపై డ్రోన్ లతో దాడి చేశాయి.  దాడికి పరోక్షంగా ఇరాన్ సహకరించిందని అమెరికాతో సహా సౌదీ ఆరోపించింది.  ఇరాన్ ను కంట్రోల్ లో ఉంచాలని, లేదంటే దాని వలన ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతింటుందని హెచ్చరించింది.  


ప్రపంచంలో 30శాతం చమురు ఎగుమతులు, 20శాతం వాణిజ్య మార్గాలను మిడిల్ ఈస్ట్ నెలవుగా ఉంది.  ఇప్పుడు ఈ ప్రాంతంలో అలజడి నెలకొనడంతో వీటిపై ప్రభావం చూపే అవకాశం ఉంది.  ఇది అంత మంచిది కాదు.  ఇక్కడ ఏదైనా తేడా జరిగితే ప్రపంచ జీడీపీపై ప్రభావం చూపుతుంది.  ఫలితంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలుతుంది.  దీంతో పెట్రోల్ ధరలు అత్యధిక స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుందని సౌదీ యువరాజు పేర్కొన్నారు.  


ఇరాన్ ను ప్రపంచ దేశాలు కంట్రోల్ చేయాలనీ సౌదీ విజ్ఞప్తి చేస్తున్నది.  కంట్రోల్ చేయడానికి యుద్ధం ఒక్కటే సరైన మార్గం కాదని, యుద్ధంతో ఎలాంటి ప్రయోజనం లేదని, యుద్ధం చేయడం తమకు ఇష్టం లేదని, యుద్ధం కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతింటుందని అందుకే తాము ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సౌదీ యువరాజు పేర్కొన్నారు.  మరి ఇరాన్ ఈ విషయంపై ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: