తెలంగాణ రాజకీయల చూపు  హుజూర్నగర్ ఉప ఎన్నిక వైపే ఉంది. గత  అసెంబ్లీ ఎలక్షన్స్ లో కంటే హుజూర్నగర్ ఉప ఎన్నిక కోసం పోటీ రసవత్తరంగా సాగుతుంది. గెలుపే  లక్ష్యం గా అన్ని పార్టీలు ముందుకు సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీలు ఎన్నికల తేదీలు ఖరారు కాకముందే నుంచి హుజూర్నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు పావులు కదుపుతుండగా...  ఇప్పుడు ఇంకాస్త జోరు  పెంచాయి . మరోసారి విజయం దక్కించుకోవాలని కాంగ్రెస్... ఈసారి ఎలాగైనా విజయం దక్కించుకోవాలని టిఆర్ఎస్... తన విజయంతో అందరిని షాక్ కి  గురి చేయాలని బిజెపి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే హుజూర్నగర్ ఉప ఎన్నిక  అక్టోబర్ 21 న జరగనుంది. 

 

 

 

 

 కాగా  హుజూర్నగర్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వివిధ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు  నామినేషన్లు దాఖలు చేశారు. తెరాస నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి , సీపీఎం నుంచి పారేపల్లి శేఖర్ రావు లు నామినేషన్ దాఖలు చేయగా... స్వతంత్ర అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న నామినేషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఇంకొంతమంది స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే అభ్యర్థుల నామినేషన్లను స్వీకరించిన అధికారులు... మంగళవారం వాటిని పరిశీలించనున్నారు . నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అక్టోబర్ 3 వరకు గడువు ఉంది. 

 

 

 

 

 ఈ సందర్భంగా హుజూర్నగర్ ఉప ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి అమయ్  కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు గొడవలు జరిగిన... ప్రలోభాలకు దూషణలకు మీటింగ్ కి దిగిన... వెంటనే 18004252838 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ఈ విషయం లోకల్ టీవీ ఛానల్స్ ప్రెస్ కి కూడా తెలపడం జరిగిందని తెలిపారు. కాగా ఇప్పటికె  కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చాయని తెలిపిన ఆయన...  తాహసిల్దార్ ఆధ్వర్యంలో అన్ని రకాల పర్యవేక్షణ జరుపుతున్నామని  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: