దేశం చూపును త‌న‌వైపు తిప్పుకొంటున్న మహారాష్ట్ర ఎన్నిక‌ల‌కు సంబంధించి...కీల‌క ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డిన‌ప్ప‌టికీ...ఇంకా అభ్య‌ర్థుల విష‌యం పూర్తిగా కొలిక్కి రాక‌ముందే...కీల‌క నేత ఒక‌రు ముఖ్య‌మంత్రి ఎవ‌రు కాబోతున్నారో ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి ఆదిత్య థాకరేనే అని శివసేన సీనియర్ నాయకులు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. వర్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. శాసనసభ ఎన్నికల అనంతరం ఆదిత్యను సీఎంగా చూడబోతున్నారని సంజయ్ రౌత్ చెప్పారు. మహారాష్ట్రలో అక్టోబర్ 21న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.


వర్లి నియోజకవర్గం నుంచి ఆదిత్య పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన కార్య‌క్ర‌మం  సాంకేతిక సమస్యల వల్ల చంద్రయాన్-2 చంద్రుడిపై దిగలేకపోయింది కానీ.. ఈ సూర్యుడు(ఆదిత్య థాకరే) మహారాష్ట్ర సీఎం కార్యాలయంలోని ఆరో అంతస్తుకు కచ్చితంగా చేరుకుంటారని రౌత్ పేర్కొన్నారు. ఇదిలాఉండ‌గా, 2014 ఎన్నికల్లో పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులకు ఆయా స్థానాల్లో తిరిగి పోటీకి వీలుగా శివసేన ఈ ఏబీ ఫాంలు అందించింది.  మహారాష్ట్రలో శివసేనతో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం రెండు రోజుల్లో వెల్లడిస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి.అయితే, ఈ స‌మ‌యంలోనే... శివసేన ఈ విధంగా వ్యవహరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


మ‌రోవైపు.... శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ మరో షాక్. ఇప్పటికే చాలా మంది పార్టీ అగ్రనేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధికార బీజేపీలో చేరగా తాజాగా మరో అభ్యర్థిని కూడా కమలం గూటికి చేరారు. బీడ్ జిల్లాలోని కైజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నమిత ముందాడ ఎన్సీపీ తరఫున పోటీ చేస్తుందని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించిన కొద్దిరోజుల వ్యవధిలోనే ఆమె పార్టీ మారడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మహారాష్ట్ర మంత్రి పంకజ ముండే, లోక్‌సభ ఎంపీ ప్రీతమ్ ముండే సమక్షంలో నమిత సోమవారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కైజ్ నియోజకవర్గం నుంచి ఎన్సీపీ తరఫున పోటీ చేసిన నమిత బీజేపీ అభ్యర్థి సంగీత తాంబ్రే చేతిలో ఓటమిపాలైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: