ఏపీలో జగన్ చరిత్ర సృష్టించారు. ఎన్నో ఏళ్లుగా రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్యకు చెక్ పెట్టారు.  కేవలం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలోనే   నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి రికార్డు కొట్టారు. మొదట గ్రామ వాలంటీర్ల పేరిట నిరుద్యోగ యువతకు రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన విషయం తెలిసిందే. వారికి మళ్ళీ మంచి భవిష్యత్ ఇచ్చేవరకు ఈ ఉద్యోగాలు ఆసరాగా నిలబడనున్నాయి.


ఇక వీటి తర్వాత ఊహించని విధంగా లక్షన్నర వరకు గ్రామ/వార్డ్ సచివాలయాల పేరిట ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. కేవలం నెలన్నర వ్యవధిలోనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షలు పెట్టి, ఉద్యోగాలు భర్తీ చేసేశారు. ఉద్యోగాలు వచ్చిన వారు అక్టోబర్ 2 నుంచి విధుల్లో చేరనున్నారు. గ్రామాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సచివాలయాల్లో వారు విధులు నిర్వర్తించనున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం జాతీయ మీడియాలో సైతం హైలెట్ అవుతోంది.


అయితే ఈ స్థాయిలో ఉద్యోగాలు ఇవ్వడం పట్ల యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నిరుద్యోగుల కలలు నెరవేర్చి లక్షన్నర ఉద్యోగాలు కల్పించిన గొప్ప సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడుతున్నారు. జీవితాంతం జగన్ కు రుణపడి ఉంటామని కొత్తగా ఉద్యోగాలు పొందిన గ్రామ సచివాలయ ఉద్యోగులు ఆనందభాష్పాలు రాలుస్తున్నారు.


ఆనాడు తండ్రి దివంగత నేత వైఎస్సార్ ఫీజు రీ ఎంబర్స్ మెంట్ ఇచ్చి పై చదువులు చదువుకునేలా చేస్తే...నేడు తనయుడు జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చి తమ జీవితాల్లో వెలుగునింపారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలా తమ జీవితాలకు దారి చూపించి.... వెలుగునింపిన తండ్రి, తనయులని జీవితంలో మరిచిపోలేమని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పనిని సక్రమంగా నిర్వర్తిస్తూ జగన్ కు మంచి పేరు తీసుకొస్తామని ఉద్యోగులు మాట ఇస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: