ఫ్యాషన్ కు పారిస్ పుట్టినిల్లు.  అక్కడ రకరకాల మోడల్స్ ర్యాంప్ వాక్ చేస్తుంటారు.  పారిస్ ఫ్యాషన్లో మహిళలతో పాటు పురుషులు కూడా రాంప్ వాక్ చేస్తుంటారు.  పురుషులకు సంబంధించిన వస్త్ర కలెక్షన్స్ ఉన్నప్పుడు పురుషులు, మహిళల కలెక్షన్స్ ఉన్నప్పుడు మహిళలు క్యాట్ వాక్ చేస్తుంటారు.  పారిస్ ఫ్యాషన్ వీక్ లో మోడల్ గా క్యాట్ వాక్ చేయాలి అంటే చాలా టాలెంట్ ఉండాలి.  


టాప్ మోడల్స్ అందరికి పారిస్ ఒక అడ్డా.  పారిస్ ఫ్యాషన్ వీక్ లో క్యాట్ వాక్ చేసారంటే వారికీ ప్రపంచం రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలుకుతుంది.  ఐష్ సైతం ఈ ఫ్యాషన్ వీక్ లో సందడి చేసింది.  అయితే ఇటీవలే ముగిసిన ఈ ఫ్యాషన్ వీక్ లో ఓ అద్భుతమైన దృశ్యం చోటు చేసుకుంది.  ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరు పగలబడి నవ్వుకున్నారు.  


మాములుగా మహిళలు క్యాట్ వాక్ చేస్తే చాలా అందంగా ఉంటుంది.  అదే ర్యాంప్ పై మహిళలు నడిచినట్టుగా పురుషులు క్యాట్ వాక్ చేస్తే చాలా ఛండాలంగా ఉంటుంది.  ఇంకా చెప్పాలంటే చూడటానికి నవ్వు తెప్పించేలా ఉంటుంది.  ఇలానే ఈ ఫ్యాషన్ షో మరికాసేపట్లో నడుస్తుంది అనగా.. అప్పటి వరకు సీరియస్ గా సాగిన షో కాస్త కాసేపు నవ్వులు పూయించేలా ప్లాన్ చేశారు.  అందుకోసమే జర్మనీకి చెందిన మోడల్ రంగంలోకి దిగాడు.  


మహిళలు వేసుకునే బట్టలు వేసుకొని తన విచిత్రమైన నడకతో ఆకట్టుకున్నాడు.  మోకాళ్ళ వరకు మహిళలు వేసుకున్నట్టుగా లాంగ్ షూ వేసుకొని తలపై టోపీ పెట్టుకొని మహిళలు క్యాట్ వాక్ చేసినట్టుగా వాక్ చేశాడు.  అంతే వందలాది మందితో నిండిపోయిన ఆ హాల్ ఒక్కసారిగా నవ్వులు పూశాయి.  జర్మనీ మోడల్ లియోన్ క్యాట్ వాక్ కు మంచి క్రేజ్ వచ్చింది. అక్కడే ఉన్న వ్యక్తులు ఆ దృశ్యాలను వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.  జర్మన్ మోడల్ లియోల్ టాప్ మోడల్ లిస్ట్ లో చేరిపోయాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: