తిరుమల బ్రహ్మొత్సవాల సందర్భంగా  శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పించనున్న నేపద్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  సోమవారం సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా సీఎం జగన్ కు ఘనస్వాగతం లభించింది. రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి , సిఎంఓ కార్యాలయం కార్యదర్శి ధనంజయ రెడ్డి ముఖ్యమంత్రి వెంట తరలి వచ్చారు. కాగా విమానాశ్రయంలో టిటిడి చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి,  ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామిలు  సీఎం జగన్ కు స్వాగతం పలికారు.  



ముఖ్యంమత్రి వై ఎస్ జగన్ కు రాష్ట్ర మంత్రి డా. ఆదిమూలపు సురేష్,  పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్, మిథున్ రెడ్డి, రెడ్డెప్ప, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి,  శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డిలతో పాటు బియ్యపు మధుసూధనరెడ్డి, చింతల రామచంద్ర రెడ్డి,  నవాజ్ బాషా, జంగాలపల్లి శ్రీనివాసులు, వెంకట గౌడ, ఎం.బాబు , ప్రభాకర రెడ్డి,  జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా, డీఐజీ కాంతిరాణా టాటా, జాయింట్ కలెక్టర్ మార్కండేయులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. 




వీరితో పాటుగా సీఎం జగన్ కు సాదర స్వాగతం పలికిన వారిలో  తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ పిఎస్.గిరిషాలతో పాటుగా తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సురేష్, సిఐఎస్ఎఫ్ కమాండెంట్ శుక్లా, సిఎస్ఓ రాజశేఖర రెడ్డి , టర్మినల్ మేనేజర్ బాబీ, స్విమ్స్ డైరెక్టర్ వెంగమ్మ, తహశీల్దార్ విజయసింహా రెడ్డి. నాయకులు భూమన అభినయ్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, పద్మాజ రెడ్డిలు ఉన్నారు. ఈ సందర్బంగా వైఎస్ ఆర్ సిపి  కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం విమానాశ్ర వెలుపల ప్రజల నుండి వినతులు స్వీకరించి తిరుమల బయలు దేరి వెళ్లారు.







మరింత సమాచారం తెలుసుకోండి: