హైదరాబాద్ ఇటివల భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలు పడడంతో వర్షపు నీరు భారీగా చేరుతోంది. ఎక్కడ చూసినా వర్షపు నీరే. భారీ వర్షాలకు నగరంలోని అనేక ప్రాంతాలు నీట మునిగుతున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు, కాలువలు పొంగి పొర్లుతున్నట్టు వీధుల్లో, కాలనీల్లో వర్షపు నీరు పొంగి ప్రవహిస్తోంది. మోకాళ్లు లోతు నీళ్లలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీటికి డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతింది. దీంతో రోడ్ల మీద వర్షపు నీరు అధికంగా ప్రవహిస్తోంది. అయితే.. ఈ నీటిలో ఓ వృద్ధుడు కొట్టుకుపోతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

 


హైదరాబాద్ లోని కృష్ణా నగర్ లో జరిగిందీ సంఘటన. యూసఫ్ గూడ ప్రాంతంలోని కృష్ణా నగర్ లో ఓ వృద్ధుడు భారీగ పొంగి వస్తున్న వరద నీటిలో ఓ ద్విచక్ర వాహనాన్ని అదుపు కోసం పట్టుకునే క్రమంలో పట్టు జారిపోయాడు. నీటి ప్రవాహ ధాటికి నియంత్రణ కోల్పోయిన ఆ వృద్దుడు ఆ నీటిలో కొట్టుకుపోయాడు. ఆలస్యంగా బయటకొచ్చిన ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో షేర్ అవుతోంది. అయితే ఆ వృద్ధుడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడు, వరద నీటి నుంచి సురక్షితంగా బయటపడ్డాడా లేదా అనేది తెలియరాలేదు. వరద ఉధృతి మాత్రం భారీ గానే ఉంది.

 


ముంబయి, చెన్నై మాదిరిగానే హైదరాబాద్ లో కూడా కాలువల పరిస్థితి అధ్వాన్నంగానే ఉంది. సరైన వ్యవస్థ లేకపోవటం వల్లే వర్షపు నీరు వెళ్లే దారిలేక వీధులన్నీ ముంపునకు గురవుతున్నాయి. ఇటువంటి సంఘటనలతో నాలా వ్యవస్థ ఎలా ఉందో తెలుస్తోంది. ప్రజలందరూ ఈ వరదతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వర్షపు నీరు సులువుగా వెళ్లే ఏర్పాట్లు చేస్తే ఇటువంటి ఘటనలు పునరావృతం కావు.


మరింత సమాచారం తెలుసుకోండి: