ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే ప్రభుత్వంలోనే అత్యున్నత అధికారి.. ఆయన జీతం దాదాపు రెండున్నర లక్షల రూపాయలు ఉంది. రాష్ట్ర పరిపాలన భారమంతా ప్రభుత్వపరంగా ఆయన చేతులమీదుగానే జరుగుతుంది. అలాంటి వ్యక్తి జీతం రెండున్నర లక్షలు ఉంటే.. ప్రభుత్వ సలహాదారుగా ఇటీవల నియమితులైన మాజీ జర్నలిస్టు దేవులపల్లి అమర్ జీతం రూ. 3.8 లక్షలుగా ఉండటం సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశం అవుతోంది.


ఐఏఎస్, ఐపిఎస్ కావడం చాలా కష్టం. దానికి కొన్నేళ్లు కష్టపడాలి. కఠోరంగా శ్రమించాలి. రోజులో 20 గంటలు దానికే కేటాయించాలి. ఆ పరీక్ష పాసయ్యేవరకూ రోజూ యజ్ఞమే. ఆ తర్వాత పోస్టింగుల కోసం మరో యుద్ధం. వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లు సరేసరి. పాలకులు చెప్పిన పనిచేస్తేనే పోస్టింగ్, లేకపోతే వీఆర్‌లో నిరీక్షించాల్సిందే.


కానీ.. ఇవేమీ లేకుండా, ఇన్ని సినిమా కష్టాలు లేకుండా, పెద్దగా చదువుకోక పోయినా, పాలకుల దయతో సలహాదారులయిపోతున్న వారి జీతాలు మాత్రం వారికంటే రెండు, మూడింతలు ఎక్కువే కావడం విశేషమంటూ విమర్శలు వస్తున్నాయి. విచిత్రమేమిటంటే.. అమర్ నియామకానికి సంబంధించి జీవో ఇచ్చిన సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌కూ అంత జీతం లేకపోవడం. దీనిపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.


ఆయనకు ఇచ్చిన అంతర్రాష్ట మీడియా వ్యవహారాల సలహాదారు జిఓను పరిశీలిస్తే.. మన ఐఏఎస్, ఐపిఎస్, బంట్రోతుల మాదిరిగా అమర్ అమరావతిలో ఉండనక్కర్లేదు. ఎంచక్కా తెలంగాణ రాజధాని, తన రాష్ట్రమైన తెలంగాణలోనే ఉండి, ఎప్పుడైనా సరదాగా బెజవాడ వచ్చి, సీఎంతో మాట్లాడి వెళ్లిపోవచ్చు.ఇప్పటికే కమ్యూనికేషన్స్‌కు ఒక సలహాదారు, మీడియాకు మరో సలహాదారున్నారు. సజ్జల రామ కృష్ణా రెడ్డి, జివిడి కృష్ణ మోహన్ వంటి ముఖ్యుల బేసిక్ శాలరీ మూడు లక్షలంటున్నారు. దీనిపైనా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: