తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారైంది... నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటు ఆర్టీసీ ని... అటు ఆర్టీసీ  ఉద్యోగుల భద్రతను కూడా కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు. అయితే తమ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడంతో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగించింది. తమ డిమాండ్ల పై  ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 5 నుంచి ఆర్టీసీ సమ్మె చేస్తామని ఆర్టీసీ యూనియన్లు అల్టిమేట్టం కూడా జారీ చేసారు. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చింది. ఆర్టిసి యూనియన్ల డిమాండ్లపై ప్రభుత్వం నేడు కేబినెట్ మీటింగ్ లో చర్చించనుంది . ప్రగతి భవన్ లో క్యాబినెట్  భేటీ జరగనుంది... ఈ భేటీలో ప్రధానంగా మూడు అంశాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. అయితే రెవెన్యూ చట్టం పేరును భూమాత  మార్చు చేసి  రెవిన్యూ చట్టాన్ని సవరణ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిపై క్యాబినెట్ భేటీలో   చర్చించి కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా సచివాలయం కూల్చివేసి నూతన సచివాలయం నిర్మాణం అంశం... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం విలీనం భేటీలో చర్చకు  చర్చకు రానుంది. 

 

 

 

 

 అయితే ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే ఈ నెల 5న సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఆర్టీసీ కార్మికులు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోనుంది . ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తుందా  లేక... ఆర్టీసీ కార్మికులను శాంతిపరిచేందుకు ఇంకా ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుందా  అనేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: