తన తప్పు లేకపోయినా మందలించారన్న మనస్తాపంతో ఓ పోలీసు అధికారి అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు. గత రాత్రి 10:30-11 గంటల మధ్య విజయవాడ దుర్గగుడి ఘాట్ రోడ్డు టోల్ గేటు వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసు అర్ధనగ్న ప్రదర్శనతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..ఉత్సవ కమిటీ కార్లలో మంత్రి అనుచరులు. అడ్డుకున్న పోలీసు అధికారికి అంక్షింతలు. ఫలితంగా మనస్తాపంతో చొక్కా విప్పి అర్ధనగ్న ప్రదర్శన చేసిన పోలీస్ అధికారి. 



మంత్రి అనుచరులు కొందరు ఉత్సవ కమిటీ కార్లలో వస్తుండగా సదరు పోలీసు అధికారి అడ్డుకున్నారు. దీంతో వారు మంత్రికి ఫోన్ చేయడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మంత్రి అనుచరులు వెళ్తున్న కార్లను ఆపిన పోలీసు అధికారికి ఫోన్ చేసి మందలించారు.అయితే, తాను ఎటువంటి తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా, ఎక్కువ మాట్లాడితే సస్పెండ్ చేయిస్తామంటూ పై అధికారులు మండిపడ్డారని సదరు పోలీసు అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వంలో పోలీస్ అధికారుల కి గౌరవం ఇవ్వడం లేదు బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి దానికి ఒక పోలీస్ అధికారి అర్ధనగ్న ప్రదర్శన నిదర్శనం. అంతేకాక, తీవ్ర మనస్తాపంతో చొక్కా విప్పి నిరసన తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందిస్తూ అది నిరసన కాదని, అతడు ఫిట్స్ వచ్చి పడిపోతే ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పడం గమనార్హం.



ఇదిలా ఉండగా ఈ రోజు సకల వేద స్వరూపం  గాయత్రీదేవి రూపంలో కనక దుర్గ దేవి దర్శనమిస్తున్నారు. అన్ని మంత్రాలకు మూలశక్తి ఆ మాత. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన అయిదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.ఈమెను ధ్యానిస్తే అనంత మంత్రశక్తి కలుగుతుంది. సకల దురిత ఉపద్రవాలు శాంతిస్తాయి. బ్రహ్మ జ్ఞానం కలుగుతుంది.గాయత్రీ ఉపాసన వల్ల  బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేదం పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: