రాజకీయాలోకి కొత్త కొత్త వ్యక్తులు కొత్త కొత్త ఆలోచనలు వస్తున్నాయి.  ఇలా కొత్త వ్యక్తులు, కొత్త ఆలోచనలు రావడంతో రాజకీయాల్లో కొత్తదనం కనిపించింది.  ఒకప్పుడు రాజకీయాలంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు.  ఎందుకులే అని చెప్పి పక్కన పెట్టేవారు.  కానీ, ఇప్పుడు రాజకీయాలను ప్రజలు పట్టించుకుంటున్నారు.  రాజకీయాల్లోకి రావాలని చూసే వ్యక్తులు చాలామంది ఉన్నారు.  రాజకీయాల్లోకి వస్తే.. దానిద్వారా ప్రజల్లోకి వెళ్లాలని అనుకున్న వ్యక్తులు బోలెడుమంది ఉన్నారు.  


అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత నిలదొక్కుకుంటారు లేదా అన్నదానిమీదే అందరి భవిష్యత్తులు ఆధారపడి ఉంటాయి.  చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి వెంటనే పక్కకు తప్పుకుంటారు.  పోరాటం చేయలేరు.  ఎందుకు వస్తున్నారో తెలియకుండా వస్తారు.  వచ్చిన తరువాత తెలియకుండానే వెళ్ళిపోతారు. కొన్ని కొంతమంది పార్టీని స్థాపించిన.. ఎన్నికల్లో పోటీ చేసినా.. పార్టీని స్థాపించిన వ్యక్తులు, నడిపించే వ్యక్తులు మాత్రం ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయరు.  శివసేన పార్టీ విషయంలో ఇప్పటి వరకు ఇలానే జరుగుతున్నది.  


బాలాసాహెబ్ థాకరే కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే, పార్టీ మాత్రం తప్పనిసరిగా ప్రభావం చూపుతుంది. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా బీజేపీతో పొత్తు పెట్టుకొని పార్టీని నడిపించారు.  ఇప్పటి వరకు పార్టీ అదే పార్టీతో పొత్తును కొనసాగిస్తోంది.  ఈనెల 21 వతేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో మొదటిసారి ఆ పార్టీతరపున థాకరే కుటుంబం బరిలోకి దిగుతున్నది.  


థాకరే మనమడు ఆదిత్య థాకరే ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయబోతున్నాడు.  వోర్లి నియోజక వర్గం నుంచి అయన పోటీ చేస్తున్నారు.  మొదటిసారి పోటీ చేస్తుండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది.  ఈసారి ఎన్నికల్లో బీజేపీ, శివసేన విజయం సాధిస్తే.. ఆదిత్య థాకరేకు ఉపముఖ్యమంత్రి పదవి లభించే అవకాశం ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో అనుభవం కావాలి.  మహారాష్ట్రకు యువనాయకుల అవసరం ఉన్నది కాబట్టి ఆదిత్య థాకరే ఎన్నికల బరిలో నిలిచినట్టు తెలుస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: