మహారాష్ట్రకు అక్టోబర్ 21 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి.  ఎన్నికలు సమీపిస్తుండటంతో సమీకరణాలు రోజురోజుకు మారిపోతున్నాయి.  ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో.. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.  ఇప్పటికే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరింది.  కాంగ్రెస్ పార్టీ జాబితాను కూడా రిలీజ్ చేస్తున్నది.  అటు ఎన్సీపీ కూడా అభ్యర్థులను నిర్ణయించే పనిలో ఉన్నది.  


పార్టీ మారుదామని అనుకునే వ్యక్తులను పార్టీ ముందుగానే సూచనలు చేసింది.   ఖచ్చితంగా గెలుస్తారు అందుకునే వ్యక్తులకు ముందుగా సీట్లు కేటాయిస్తోంది. అయితే, దేశంలో బీజేపీ గాలి బలంగా వీస్తుండటంతో.. పాపం కాంగ్రెస్, ఎన్సీపీలు తమ అభ్యర్థులను కాపాడుకోవడానికే చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.  శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.  కానీ, కుదరడం లేదు.  


ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీకి చెందిన చాలామంది వ్యక్తులు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.  అటు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన సినీనటి ఊర్మిళ గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేసింది.  అంతర్గత కలహాలే కారణం అని చెప్పింది.  ఆమె శివసేన చేరే అవకాశం ఉన్నట్టుగా కొంత సమాచారం ఉన్నా ఆ దిశగా ఎలాంటి వార్తలు రావడం లేదు.  అయితే, ఇపుడు మహాలో ఎన్సీపీకి కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయి.  


గెలిచే వ్యక్తులకు టిక్కెట్లు కేటాయించినా.. ఆ వ్యక్తులు పార్టీలో ఉండకుండా పార్టీ మారిపోతున్నారట.  దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.  ఎన్సీపీ పార్టీ నుంచి బీడ్ నియోజక వర్గం అభ్యర్థిగా నమిత ముండాడాను ఎంపికచేశారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ఎన్సీపీ ఆమోదించింది. టికెట్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది.  అదే సమయంలో ఆమె ఆ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది.  శివసేన.. బీజేపీ నుంచి ఆమెకు టికెట్ హామీ ఇవ్వడంతో ఎన్సీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయింది.  ఇది ఎన్సీపీకి పెద్ద దెబ్బ అని చెప్పాలి.  ఇంకా చాలా మంది నేతలు జంప్ కావడానికి చూస్తున్నారట.  


మరింత సమాచారం తెలుసుకోండి: