ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ మద్యం దుకాణాలకు ఫుల్ స్టాప్ పడింది.  ప్రభుత్వమే సొంతంగా మద్యం దుకాణాలను నడిపేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే.  ప్రభుత్వ మద్యం దుకాణాలు ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి.  ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయి.  ఆ తరువాత మూసేస్తారు.  ప్రభుత్వం నియమించిన వ్యక్తులు మాత్రమే మద్యం విక్రయిస్తారు.  అంతేకాదు, మద్యం కొనుగోలు చేసి ఇళ్లకు వెళ్లి తీసుకోవాలి తప్పించి.. బయట తాగేందుకు వీలులేదు.  


ఒకవేళ ఎవరైనా అలా చేస్తే.. తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది ప్రభుత్వం.  ప్రభుత్వ మద్యం దుకాణాలపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.  ప్రభుత్వం దుకాణాలను మూసేయాలని కొంతమంది మహిళలు రోడ్డుపైకి వచ్చి నినాదాలు చేస్తున్నారు.  అయితే, మద్యం దుకాణాల్లో అప్పటివరకు పనిచేసిన వ్యక్తుల జీవితాలు ఏంటి అన్నది ప్రశ్నర్ధకంగా మారింది.  చదువులేక మద్యం దుకాణాల్లో పనిచేయడమే తెలిసిన తమకు ఉపాధి ఏంటి అని వారు వాపోతున్నారు.  


ఇదిలా ఉంటె, ప్రైవేట్ షాపులు క్లోజ్ చేస్తున్న తరుణంలో కొన్ని మద్యం దుకాణాల గురించిన వివరాలు బయటకు వస్తున్నాయి.  అందులో ఒకటి కెసిఆర్ మద్యం షాప్.  అదేంటి అని షాక్ అవ్వకండి.  కెసిఆర్ పేరుతో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో ఓ మద్యం షాప్ ఉన్నది. కెసిఆర్ అనగానే తెలంగాణ ముఖ్యమంత్రి గుర్తుకు వస్తారు.  ఆయనకు సంబంధించిన షాప్ అనుకుంటే పొరపాటే.. 


షాప్ పేరుకు మాత్రమే కెసిఆర్ షాప్. నెల్లూరు జిల్లాలోని వాకాడు మండలం తూపిలిపాలెం అనే గ్రామంలో ఈ మద్యం షాప్ ఉన్నది.  కెసిఆర్ అంటే కే చెంగారెడ్డి.  అతను వైకాపా అభిమాని కావడమతో ఆ పార్టీ సింబల్ లోని కలర్ కు అనుగుణంగా షాప్ పేరును డిజైన్ చేసుకున్నాడు.  ఇప్పుడు ప్రైవేట్ మద్యం దుకాణాలు బంద్ కావడంతో ఈ దుకాణం పేరు బయటకు వచ్చింది.  ఈ దుకాణం ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: