ఎన్నికల ఘోర ఓటమి పాలైన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పరిస్తితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధికారం కోల్పోవడం ఆలస్యం చాలామంది నేతలు పార్టీని వీడిపోయారు. కొందరు బీజేపీలోకి వెళ్ళితే...మరికొందరు వైసీపీలోకి వెళ్లారు. ఇక ఓడిపోయిన కొందరు నేతలు చాలావరకు సైలెంట్ అయిపోయారు. ఎక్కడ వైసీపీ మీద విమర్శలు చేస్తే తమ మీద కేసులు బయటకుతీస్తారని భయపడిపోతున్నారు.


ఈ సమయంలోనే రాజకీయ రాజధాని విజయవాడ టీడీపీ నేతలు కూడా పార్టీని గాలికొదిలేశారు. ఎవరి దారి వారు చూసుకుంటూ పార్టీ బలోపేతానికి పెద్దగా కృషి చేయడం లేదు. పార్టీ తరుపున గెలిచిన విజయవాడ ఎంపీ కేశినేని నాని మొన్నటివరకు సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. ఆ విమర్శలు వల్ల పార్టీకి చాలావరకు డ్యామేజ్ జరిగింది. మధ్యలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా కేశినేనిపై విమర్శలు చేసి..తర్వాత సైలెంట్ అయ్యారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు తప్ప...పార్టీ కోసం పెద్దగా చేసిందేమి లేదు.


అటు సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా...పార్టీలో ఉండాలో లేక వదిలేయాలో తెలియని అయోమయంలో ఉన్నారు. ఒకరోజు పార్టీలో యాక్టివ్ కనిపిస్తే...మరొకరోజు అడ్రెస్ ఉండరు. ఇక వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన కూతురు షబానా అమెరికా వెళ్ళిపోయారు. ఈస్ట్ నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ నియోజకవర్గంలోనే ఉంటూ...తన పని తాను చేసుకుంటున్నారు. పైగా పి‌ఏ‌సి ఛైర్మన్ పదవి ఇవ్వలేదని అధినేత మీద అలిగినట్లు తెలుస్తోంది.


అయితే విజయవాడ టీడీపీలో బాగా యాక్టివ్ గా ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది యువ నేత దేవినేని అవినాష్ ఒక్కడే. అవినాష్ పార్టీ కార్యక్రమాల్లో అన్నిటిలో పాల్గొంటున్నారు. అలాగే తెలుగు యువత అధ్యక్షుడుగా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. ఇంత యాక్టివ్ గా ఉన్న అవినాష్ ప్రస్తుతానికి కొంచెం సైలెంట్ అయినట్లు కనిపిస్తోంది. సీనియర్లని డామినేట్ చేయొద్దని అధిష్టానం నుంచి వార్నింగులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ కోసం కష్టపడే అవినాష్ కూడా మెదలకుండా చూస్తూ ఉన్నారు. మొత్తం మీద చూసుకుంటే విజయవాడలో టీడీపీ పరిస్తితి ఘోరంగా తయారైంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: