తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ తో కాంగ్రెస్ నేతలు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి గ‌డ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం హైద‌రాబాద్ తార్నాక‌తోని కోదండ రామ్ నివాసంలో సమావేశమయ్యారు. ఈసందర్భంగా కోదండ‌రామ్‌ను  హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతిరెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. కోదండ‌రామ్‌తో దాదాపుగా గంట‌సేపు మంత‌నాలు జ‌రిపిన కాంగ్రెస్ నాయ‌కులు అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన కాంగ్రెస్ నేతలు ఉప ఎన్నికలో టీజేఎస్ తమకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు.


ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు మద్దతిచ్చే అంశంపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోదండరామ్ చెప్పారు. అయితే 2018 ఎన్నిక‌ల్లో జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ, కాంగ్రెస్‌, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీ, టీజేఎస్ మ‌హాకూట‌మి గ‌ట్టి పోటీ చేశారు. అయితే ఇందులో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌కు కొన్ని సీట్లు ద‌క్కాయి కానీ, టీజేఎస్‌, సీపీఐకి ఒక్క సీటంటే ఒక్క‌టి కూడా ద‌క్క‌లేదు.


ఇక తెలంగాణ ఇంటిపార్టీకి అస‌లు సీటు కూడా కెటాయించ‌లేదు. అయినా కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా పార్టీ అధ్య‌క్షుడు చెరుకు సుధాక‌ర్ త‌ప్ప‌ని ప‌రిస్థితుల్లో కూట‌మికి మ‌ద్ద‌తు ఇచ్చారు.తెలంగాణ‌లో ఇప్పుడ హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక కాంగ్రెస్‌కు ప్ర‌తిష్టాత్మ‌కంగా మారిన నేప‌థ్యంలో ఇప్పుడు టీజేఎస్‌, సీపీఐ, టీడీపీ, తెలంగాణ ఇంటిపార్టీని కాంగ్రెస్ నేత‌లు క‌లుస్తూ మ‌ద్ద‌తు కోరుతున్నారు. ఇప్ప‌టికే టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్‌.ర‌మ‌ణ‌ను క‌లిసిన న‌ల్ల‌గొండ ఎంపీ, పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరారు.


కానీ టీడీపీ నేత‌లు త‌మ పార్టీ నుంచి చావా కిర‌ణ్మ‌యిని అభ్య‌ర్థిగా పోటీకి దింపింది. ఇక సీపీఐ పోటీ చేయ‌లేదు.. ఇక టీజేఎస్, తెలంగాణ ఇంటిపార్టీలను కాంగ్రెస్ నేత‌లు క‌లిసి మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ఇప్పుడు కోదండ‌రామ్ నిర్ణ‌యం ఏంట‌నేది ఇంకా స్ప‌ష్టం కాలేదు..ఇక సీపీఐ నేత నారాయ‌ణ సాయంత్రం త‌న పార్టీ నిర్ణ‌యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్పారు. సో ఇప్పుడు హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌లో టీజేఎస్ పాత్ర ఏంట‌నేది రేపు తేల‌నున్న‌ది.


మరింత సమాచారం తెలుసుకోండి: