ఏపీని అంధ‌కారంలోకి నెట్టి ఇప్పుడు త‌గుదున్న‌మ్మ అని దొంగ ఏడ్పులు ఏడుస్తున్న చంద్రాలుకు ఇప్పుడు కేంద్రం ఝ‌ల‌క్ ఇచ్చింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇప్పుడు విద్యుత్ కొర‌త ఏర్ప‌డింది. దీంతో కొన్ని చోట్ల విద్యుత్ స‌మ‌స్య‌లు ఎదురైవుతున్న త‌రుణంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి తీసుకున్న ముంద‌స్తు చ‌ర్య‌లు ఇప్పుడు స‌త్ఫ‌లితాలు ఇస్తున్నాయి. అందులో భాగంగా కేంద్రం సీఎం జ‌గ‌న్ కోరిక‌ను మ‌న్నిస్తూ విద్యుత్ కొనుగోలుకు అనుమ‌తి ఇస్తూ ఇచ్చిన లేఖతో ఏపీలో విద్యుత్ స‌మ‌స్య‌ల‌కు చెక్‌పెట్టింది.


గ‌త వారం రోజులుగా ఏపీ ప్ర‌జ‌ల‌ను, రైతాంగాన్ని, పారిశ్రామిక రంగాల‌ను ప‌ట్టిపీడిస్తున్న విద్యుత్ స‌మ‌స్యకు సీఎం జ‌గ‌న్ చూపిన చొర‌వ‌తో స‌మ‌స్య‌కు దాదాపుగా మంగ‌ళం పాడిన‌ట్లేన‌ని ఏపీ విద్యుత్ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ స‌మ‌స్య‌లు త‌లెత్త‌డానికి నాలుగు నెల‌ల క్రితం అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ ప్ర‌భుత్వ‌మా.. లేక ఐదేండ్లు పాలించిన టీడీపీదా అనే చ‌ర్చ‌ను లేవ‌నెత్తితే ఇది ముమ్మాటికి టీడీపీ పాల‌న పాపమే అని స్ప‌ష్టం అవుతుంది. ఎందుకంటే ఐదేండ్లు పాలించిన ప్ర‌భుత్వం విద్యుత్ స‌మ‌స్య‌ల‌పై పూర్తి స్థాయి అవ‌గాహ‌న ఉంటుంది.. కానీ ఐదేండ్ల పాల‌న‌లో విద్యుత్ స‌మ‌స్య‌ల‌ను తీర్చ‌డంకు బ‌దులు వాటిని పెంచి పెద్ద‌వి చేసారు చంద్రాలు.


ఇక ఐదేండ్ల‌లో విద్యుత్ పేరుతో దాదాపుగా రూ.20వేల కోట్ల అప్పులు పాలు చేసిన చంద్రాలు, ఎన్నిక‌ల ముందు హడావుడిగా విద్యుత్‌ను అప్పుగా తీసుకుని దాన్ని విద్యుత్ రూపంలో చెల్లించే ఒప్పందం ఇప్పుడు ఏపీకి గుదిబండ‌గా మారింది. అంటే ఇప్పుడు ఉత్ప‌త్తి అవుతున్న విద్యుత్‌లో దాదాపుగా 1200మేగావాట్ల విద్యుత్ కేవ‌లం అప్పుగానే వెళుతుందంటే ప‌రిస్థితి ఎలా చేదాటి పోయిందో అర్థ‌మవుతుంది. దీనికి తోడు చంద్రాలు కేంద్రానికి లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో విద్యుత్ స‌మ‌స్య‌కు ప్ర‌ధాన స‌మస్య‌గా చెప్ప‌వ‌చ్చు. ఆనాడు చంద్రాలు ఎల్ వో సీ ఇస్తే విద్యుత్ స‌మ‌స్య ఇలా త‌లెత్తేదే కాద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.


ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్‌ కేంద్రానికి లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌(ఎల్‌వోసి) రాష్ట్రప్రభుత్వం ఇవ్వడంతో కేంద్రప్రభుత్వం విద్యుత్‌ కొనుగోళ్లకు అనుమతి ఇచ్చింది. ముందస్తుగా నగదు చెల్లించలేదని కెఎస్‌కె అనే ప్రైవేట్‌ కంపెనీ ఫిర్యాదు చేయడంతో రాష్ట్రానికి చెందిన విద్యుత్‌ సంస్థలను కేంద్రప్రభుత్వం బ్లాక్‌ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అవసరాలకు తగ్గట్టుగా పవర్‌ ఎక్సైంజ్‌లో రాష్ట్రం విద్యుత్‌ కొనుగోలు చేసుకునేందుకు వీలు లేకుండా కేంద్రం చేసింది. రాష్ట్రప్రభుత్వం నగదు జమచేయడంతో కొనుగోళ్లకు అనుమతి ఇస్తున్నట్లు సోమవారం సదరన్‌ రీజనల్‌ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌(ఎస్‌ఆర్‌ఎల్‌డిసి) వెబ్‌సైట్‌లో పేర్కొంది.


కెఎస్‌కె థర్మల్‌ కేంద్రానికి రూ.120 కోట్లు రాష్ట్రప్రభుత్వం సోమవారం చెల్లించడంతో ఎక్సెంజ్‌లో రాష్ట్ర డిస్కంలు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. దీంతో శని, ఆదివారాలతో పోల్చుకుంటే సోమవారం రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు కూడా తగ్గాయి. ఆదివారం 6879 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉండగా అందుబాటులో 6670 మెగావాట్లు ఉంది. 200 మెగావాట్లు లోటు ఉంది. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం డిమాండ్‌ పెరిగింది. 7,200 మెగవాట్ల అవసరం కాగా అందుబాటులో 6,940 మెగావాట్లు ఉంది. 900 మెగావాట్ల లోటు ఉండగా, పవర్‌ ఎక్సెంజ్‌లో 680 నుంచి 1450 మెగావాట్లను డిస్కంలు కొనుగోలు చేశాయి. ఆదివారంతో పోల్చుకుంటే సోమవారం జెన్‌కో ఉత్పత్తి తగ్గింది. ఆదివారం 2,777 మెగావాట్ల ఉత్పిత్తి కాగా, సోమవారం 2,550 మెగావాట్లే ఉత్పిత్తి జరిగింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: