సమాజంలో ఆడవాళ్ళ పై లైంగిక వేధింపులు రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. చిన్న పిల్లల నుండి  ముసలి వాళ్ళ వరకు లైంగిక వేధింపులు ఎదురుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులు డాక్టర్లకు కూడా తప్పట్లేదు. ప్రాణాలు పోసి పునర్జన్మనిచ్చే డాక్టర్లు కూడా ఇప్పుడు లైంగిక వేధింపులు తాళలేకపోతున్నారు. ఈ విషయం ఓ  సర్వేలో తేలింది. 

 

 

 

  ఓ సర్వేలో లేడీ డాక్టర్ లకు సంబంధించి వాళ్ళ పై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ దేశంలోని ప్రతి ఐదుగురు క్రీడాకారులలో ఒకరు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్నారు. మెడ్ స్కెప్  అనే సంస్థ మూడేళ్లలో నిర్వహించిన సర్వేలో ఈ ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. అయితే లేడీ డాక్టర్లను  లైంగికంగా వేధిస్తున్న వారిలో ఎక్కువమంది వాళ్ల దగ్గర వైద్యం పొందిన వాళ్లే  ఉండటం గమనార్హం. ఇంకొంత మందిని  తమ తోటి డాక్టర్లు కూడా తమను లైంగికంగా వేధిస్తున్నాడు. 

 

 

 

 ఫోన్ కాల్స్ మెసేజెస్ ఈ మెయిల్స్ రూపంలో లేడీ డాక్టర్ లని వేధింపులకు గురిచేస్తున్నారు. తమ దగ్గర వైద్యం పొందిన పేషెంట్లు తమని డేట్ కి రావాలని కోరాడట చాలా మంది లేడీ డాక్టర్లను కోరినట్టు ఈ సర్వేలో వెల్లడైంది . గత మూడేళ్ళ నుంచి 1378 మంది లేడీ డాక్టర్ ల మీద  సర్వే నిర్వహించిన మెడ్ స్కెప్  అనే న్యూస్ సంస్థ ఈ  షాకింగ్ విషయాలను వెల్లడించింది. కాగా 17 శాతం మంది లేడీ డాక్టర్లకు  పేషంట్ల  ద్వారా లైంగిక వేధింపులు ఎదురవ్వగా... మరో  12 శాతం మంది డాక్టర్లకు ఇతర  డాక్టర్ లతో  లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. అయితే దీనిపై బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కమిటీ ని కూడా వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: