ముందు మనం బాగుంటేనే ఎదుటి వారికీ సహాయం చేయగలం. ప్రశ్నించాలన్న, పోరాడాలన్న ముందు శరీరం సహరించాలి. స్టార్ హీరో ఎదిగి,  జనం తరపున ప్రశ్నించాడనికి వచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పి మరింత తీవ్రతరం అయ్యుంది.  తన ఆరోగ్యం బాలేదని స్వయంగా పవన్ ప్రకటించడంతో మెగా అభిమానులు, జనసేన పార్టీ వర్గాలు కాసింత ఆందోళన చెందాయి. డాక్టర్లు ఎంత చెప్పిన సర్జరీ కి నో చెప్పిన పవన్ ఇప్పుడు మనసు మార్చుకున్నట్టు తెలుస్తుంది.   

హీరోగా వెండితెరపై ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' సినిమా చేశారు పవన్.  అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన గాయం కారణంగా పవన్‌కి వెన్ను నొప్పి సమస్య మొదలైంది.  అప్పటి నుంచే ఈ సమస్యకు చికిత్స తీసుకుంటూ వస్తున్నారు పవన్. మళ్ళీ ఇప్పుడు ఆ సమస్య తిరగబడటంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకోక తప్పడం లేదు.జనసేన పార్టీ స్థాపించి పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలకు వెళుతున్న సమయంలో కూడా ఇదే వెన్ను నొప్పి సమస్య పవన్‌ని వెంటాడింది.

ప్రచారం చేస్తున్న కీలక సమయంలో విశ్రాంతి తీసుకోక తప్పలేదు. ఈ సమస్య పట్ల సర్జరీకి వెళ్లమని వైద్యులు సలహా ఇచ్చినప్పటికీ సంప్రదాయ వైద్యం వైపు మొగ్గుచూపి ఆ దిశగా ముందుకు వెళ్లాలని పవన్ డిసైడ్ అయ్యారట.తన వెన్ను నొప్పి సమస్యకు ప్రకృతి వైద్యమే మేలని భావించిన పవన్.. పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్న కారణంగా దాన్ని పక్కన బెడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ సమస్య తిరగబడటంతో ఇక తప్పదని ట్రీట్‌మెంట్ తీసుకోవడం స్టార్ట్ చేశారని తెలుస్తోంది. 

ఈ ట్రీట్‌మెంట్ చాలా రోజుల పాటు కొనసాగే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ వెన్ను నొప్పి మాత్రం తీవ్రంగా మారడంతో ఆయన మరికొన్ని రోజుల పాటు ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ వర్గాలు కంగారు పడుతున్నాయి. తొందరలో ఆయన సమస్య నయం కావాలని కోరుకుంటూ ప్రార్ధనలు చేస్తున్నారు అభిమానులు.జనసేన పార్టీ పూర్తి బాధ్యతలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భుజాలపైనే ఉన్నాయి. వీలైనంత తొందరలో ఆయన తిరిగి యాక్టివ్ ఉండాల్సిన టైం లో  ఆయన వెన్ను నొప్పి సమస్య తీవ్రతరమైంది.చూడాలి మరి.. పవన్ తిరిగి కోలుకొని  ఎప్పుడు యాక్టివ్ గా ప్రజల్లోకి వస్తారు అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: