మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాల సందర్బంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో, మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎమ్.జి.బి.ఎస్) లో  మెగా డిజిటల్, ఛాయా చిత్ర ప్రదర్శన ను ఎమ్.జి.బి.ఎస్ డివిజనల్ మేనేజర్  వి. శంకర్ ప్రార౦భి౦చారు. అక్టోబర్ 01 వ తేదీ నుండి 05 వ తేదీ వరకు ఈ ఛాయా చిత్ర ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన వి. శంకర్ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైన ఉడఁదని చెప్పారు.  భవిష్యత్ తరాలకై పర్యావరణాన్ని కాపాడాల్సిన భాద్యత ను విస్మరించకుండా ముందుకు సాగాలన్నారు.  గాంధీజీ మనకు అందించిన గొప్ప అస్త్రం అహింస అని అన్నారు. ఆయన అనుసరించిన మార్గం మనకు ఆదర్శ ప్రాయం అని అన్నారు.  నేటి తరం యువత, విద్యార్థులు గాంధీ మార్గంలో నడవాలని ఆయన అన్నారు. 
కే౦ద్ర సమాచార శాఖ (తెల౦గాణ‌) అదనపు డైరెక్టర్ జనరల్  ఎస్. వెంకటేశ్వర్ మాట్లాడుతూ గాంధీజీ జీవితానికి గురించిన సమగ్ర సమాచారం ఈ ప్రదర్శనలో ఉందని, గాంధీజీ అనుసరించిన అహింసా మార్గం లో మనం అందరం నడవాల్సిన అవసరం ఉందని , ఛాయా చిత్ర ప్రదర్శన ను ప్రతి ఒక్కరు దర్శించి గాంధీజీని గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవాలని అన్నారు.



ప్లాస్టిక్ మేనేజ్మెంట్ పై జరిగిన వ్యాస రచనా పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఎస్. వెంకటేశ్వర్ బహుమతులు అందజేశారు.  ఈ చిత్ర ప్రదర్శనలో ఏర్పాటు చేసిన గాంధీజీ భారీ ఛాయాచిత్రం తో విద్యార్థులు ఉత్సాహంగా సెల్ఫీలు తీసుకొన్నారు. ఈ చిత్ర ప్రదర్శనలో  మహాత్మా గాంధీ బాల్యం నుండి చివరి దశ వరకు జరిగిన ఘటనల అరుదైన చిత్రాలు ఉ౦చబడ్డాయి.  చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం, దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమం వంటి చారిత్రక ఘట్టాలూ, వాటి గురించిన అరుదైన చిత్రాలూ,  మన స్వాతంత్య్ర ఉద్యమానికి  సంబంధించిన అనేక ఘటనలకు సంబంధించిన చిత్రాలు ఈ ప్రదర్శనలో ప్రదర్శి౦పబడుతున్నాయి.




ముఖ్యంగా  గాంధీజీ  బాల్యంలో  చదివిన ఆల్ఫ్రెడ్ హై స్కూల్, బ్రిటీష్ వారు ఉప్పు పై విధించిన పన్నుకు  వ్యతిరేకంగా చేపట్టిన ఉప్పు సత్యాగ్రహం, గాంధీజీ  జైలు జీవితం గడిపిన ఎరవాడ జైలు, దక్షిణ ఆఫ్రికా నుండి తిరిగి వస్తున్న  గాంధీజీ, కస్తూర్బా ల చిత్రాలతో పాటు  అనేక అపురూప చిత్రాలు ప్రదర్శనలో చోటుచేసుకున్నాయి. ప్లాస్టిక్ వాడకంపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో రీజినల్ ఔట్ రీచ్ బ్యూరో డైరెక్టర్ శ్రీ. ఎమ్. దేవే౦ద్ర, ఎన్ .ఎస్.ఎస్ కో ఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస రావు, శ్రీ వి. రాంబాబు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,  అసిస్టె౦ట్ డైరెక్టర్లు శ్రీ. మానస్ కృష్ణకా౦త్, హరిబాబు, భారత లక్ష్మి , పి.ఐ.బి. డిప్యూటీ డైరెక్టర్ పి. రత్నాకర్, అసిస్టె౦ట్ డైరెక్టర్ పి. కృష్ణ వందన తో పాటు కే౦ద్ర సమాచార శాఖ (తెల౦గాణ) అధికారులు, సిబ్బ౦ది పాల్గొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: