ఈ మధ్య ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు అక్రమ సంబంధాలు. ఎక్కడ చూసినా ఇదే తంతు కనిపిస్తుంది. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం అడ్డొచ్చిన వారిని చంపడం. రోజు రోజుకి మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని తమ భర్తలను కిరాతకంగా ప్రియుల సాయంతో  చంపేస్తున్నారు. అయితే మహిళలు పెళ్లి అయినప్పటికీ వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే చట్టరీత్యా నేరం కాదని సుప్రీంకోర్టు కూడా సంచలన తీర్పు ఇవ్వడంతో ఈ తంతు ఇప్పుడు ఇంకా పెరిగింది. అక్రమ సంబంధాల నేపథ్యంలో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. 

 

 

 

 

 అయితే తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తనే కడతేర్చిన  సంఘటనలు ఇప్పటికే ఎన్నో జరిగాయి... ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి ఘటన మరొకటి చోటు చేసుకుంది. మహబూబాబాద్ జిల్లా లోని రేగడి తండాలో గత నెల 21న ఈ ఘటన చోటుచేసుకుంది. చివరికి పోలీసులు ఆ హత్య కేసును ఛేదించారు పోలీసులు. అయితే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని మంగలి  కాలనీకి చెందిన ఇన్నపురపు  నవీన్ శాంతి భార్యాభర్తలు. అయితే శాంతి రెండున్నరేళ్లుగా వెంకటేష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందనే విషయం తెలిసిన నవీన్... ఈ విషయమై భార్యను మందలించాడు. అయితే భర్త కంటే ప్రియుడే ముఖ్యమని తలచిన శాంతి తమ అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్న తన భర్త నవీన్ ని  చంపాలి ప్రియుడితో కలిసి పథకం వేసింది . 

 

 

 

 తన ప్రియుడితో కలిసి భర్తను చంపించి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. అయితే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి తమ స్టైల్ లో  విచారణ చేయడంతో అసలు నిజం బయటపడింది. శాంతి తన భర్త నవీన్ ను  చంపించాలని ప్లాన్ లో భాగంగా గత నెల 21న రేగడి తండాలోని తన తల్లి ఇంటికి వెళ్లి భర్త నవీన్ ని  మటన్ తీసుకు రావాల్సిందిగా కోరింది . ఈ నేపథ్యంలో భర్త నవీన్ స్కూటీ పై రేగడితాండ బయలుదేరగా... అక్కడే కాపు కాసిన శాంతి ప్రియుడు వెంకటేష్ అతడి స్నేహితుడు పద్ధం నవీన్ తో కలిసి శాంతి భర్త  నవీన్ పై ఒక్కసారిగా దాడి చేసి ఇనుప రాదు తో తలపై బలంగా కొట్టి హత్య చేసారు. ఎవరికీ అనుమానం రాకుండా స్కూటీని నవీన్ పై  పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి అక్కడినుండి   పరార్ అయ్యారు . అయితే నవీన్ సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనా స్థలంలో దొరికిన మద్యం సీసాల పై బార్కోడ్ సహా ... నవీన్ భార్య శాంతి మొబైల్ సంభాషణల ఆధారంగా నిందితులను పట్టుకున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: