హుజూర్ నగర్ ఉపఎన్నికలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ప్రధాన పార్టీలకు తోక పార్టీల మద్దతు పలుకటమే విచిత్రంగా ఉంది. అసలే ప్రధాన పార్టీల అభ్యర్ధులు రంగంలోకి ఉండటంతో  పోటి తీవ్రంగా ఉంది. వాటికిపుడు తో కపార్టీలు తోడయ్యాయి.


అధికార తెలంగాణా రాష్ట్ర సమితికి సిపిఐ మద్దతుగా నిలిచింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా జాగృతి సమితి  మద్దతు పలికింది. పోటిలో ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్న సిపిఎం నామినేషన్ తిరస్కరణకు గురైంది.  దాంతో టిడిపి, బిజెపిలు ఒంటరిగానే పోటిలో ఉండాల్సొచ్చింది.  

 

అంటే నామినేషన్ల ఉప సంహరణ పూర్తయ్యేసరికి పోటిలో టిఆర్ఎస్-కాంగ్రెస్-టిడిపి-బిజెపిలు రంగంలో ఉన్నట్లు తేలిపోయింది. దాంతో గెలుపు కోసం ప్రతి పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అయితే మొన్నటి ఎన్నికల్లో తోక పార్టీలు అంటే సిపిఐ, సిపిఎం, తెలంగాణా జాగృతి సమితిల ప్రభావం ఏమీ కనబడలేదనే చెప్పాలి.

 

ఇక బిజెపి బలం చూస్తే పోటి చేసిన 119 సీట్లలో గెలిచింది ఒక్క నియోజకవర్గంలో మాత్రమే.   కాబట్టి బిజెపి బలంపై అందరికీ అవగాహనుంది. కాకపోతే మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలవటంతో తమ బలం పెరిగిపోయిందని అనుకుంటోంది.

 

అదే సమయంలో టిడిపి సంగతి చెప్పనే అక్కర్లేదు. మొన్నటి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని టిడిపి పోటి చేసింది. అప్పట్లో పోటి చేసిన 14 సీట్లలో టిడిపికి వచ్చింది మూడు అసెంబ్లీ నియోజకవర్గాలే. కాబట్టి ఈ ఎన్నికల్లో టిడిపి ప్రభావం కూడా పెద్దగా ఉంటుందని అనుకునేందుకు లేదు.

 

అయితే ఉపఎన్నిక జరుగుతున్న హుజూర్ నగర్ లో సెటిలర్ల ఓట్లు చాలా కీలకం. అందుకే వ్యూహాత్మకంగా చావా కిరణ్మయి అనే కమ్మ అభ్యర్ధిని టిడిపి రంగంలోకి దింపింది. ఎందుకంటే ఆ సామాజికవర్గం ఓట్లే ఎక్కువ కాబట్టి ఆ ఓట్లన్నీ తమకే వస్తాయన్నది ఆలోచన. మరి ఏం జరుగుతుందో చూడాల్సిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: