సాధారణంగా ఏదైనా నేరంపై అరెస్ట్ అయ్యే వ్యక్తులను జైలుకు పంపుతుంటారు.  కారణం ఏంటి..అంటే.. జైలుకు వెళ్లిన వ్యక్తులు సత్ప్రవర్తనతో తిరిగి వెళ్లాలనే ఉద్దేశ్యంతోనే అలా చేస్తుంటారు.  కొంతమంది వ్యక్తులు జైలుకు వెళ్లిన తరువాత మరింత కఠినంగా మారిపోతుంటారు.  రాక్షసుల్లా మారిపోతుంటారు.  బయటకు వెళ్లి పదేపదే తప్పులు చేసి.. ఒక్కోసారి చేసే నేరాలు భయానకంగా కూడా ఉండొచ్చు.  హత్యలు కూడా చెయ్యొచ్చు చెప్పలేం.  


అలా క్రూరంగా ఉండే వ్యక్తులు బయట ఉండటం కంటే జైల్లోనే ఉండటం ఉత్తమం. అందుకే అలాంటి వ్యక్తులను జైల్లోనే ఉంచుతారు.  కఠిన శిక్షలు వేస్తారు. ఇలానే చైనాకు చెందిన ఓ వ్యక్తి 17 సంవత్సరాల క్రితం అమ్మాయిలు, చిన్నపిల్లల అక్రమ రవాణా కేసులో పోలీసులు సాంగ్  జియాంగ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.  జైలుకు వెళ్లిన జియాంగ్ అక్కడి నుంచి తప్పించుకొని యున్నాన్ అటవీ ప్రాంతాల్లోకి పారిపోయాడు.  


అలా అటవీ ప్రాంతంలోకి పారిపోయిన జియాంగ్ ఆ అడవిలో ఓ గుహలో దాక్కున్నాడు.  ఆ గుహనే నివాసంగా మార్చుకున్నాడు.  మనుషులు ఎవరూ నివాసం ఉండని ప్రాంతం కావడంతో లోపలికి ఎవరూ వచ్చేవారు కాదు.  అలా జియాంగ్ దొరిన ప్లాస్టిక్ బాటిల్స్ లో నీరు నింపుకొని, అడవిలో దొరికే పండ్లు తింటూ... వేటాడి దొరికినవి తింటూ 17 ఏళ్ళు గడిపాడు.  


అప్పటికి పోలీసులు జియాంగ్ కేసును క్లోజ్ చేయలేదు.  అయితే, కొందరు ఇచ్చిన సమాచారం మేరకు అడవిలో ఎవరో వ్యక్తి ఒంటరిగా ఉంటున్నాడని పోలీసులు తెలుసుకున్నారు.  17 ఏళ్ల క్రితం పారిపోయిన జియాంగ్ అయ్యి ఉంటాడని భావించిన పోలీసులు అడవిని జల్లెడ వేశారు.. కానీ వాళ్లకు కనిపించలేదు.  చివరకు డ్రోన్ లను తెప్పించి సెర్చ్ చేయించారు.  చివరకు గుహా ఆచూకీ పోలీసులకు దొరికింది.  వేంటనే అతడ్ని పోలీసులు పట్టుకొని తీసుకెళ్లారు.  అయితే, 17 ఏళ్లుగా మాట్లాడకపోవడంతో మాట్లాడటం మర్చిపోయాడు.  ఇప్పుడు అతడిని జైలుకు తీసుకెళ్లి శిక్ష వేస్తారా చేసిన తప్పుకు 17 ఏళ్ళు అడవిలో ఒంటరి జీవితం గడిపినందుకు వైద్యం చేయించి వదిలేస్తారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: