ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి...ఎన్ని అవాంతరాలు ఎదురైన అమలు చేసే నైజంగల నాయకుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో అదే పని చేశారు. తాను తీసుకున్న నిర్ణయాలు మీద ఎన్ని విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లారు. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టులో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడం, విద్యుత్ పీపీఏల పునః సమీక్షించడం, అవినీతిని అరికట్టడానికి ఇసుక తవ్వకాలని పూర్తిగా ఆపేసి..దాని మీద కొత్త పాలసీ తీసుకురావడం,  ప్రజావేదిక కూలగొట్టడం,అమరావతి నిలిపివేయడం, అన్న క్యాంటీన్లు ఆపేయడం ఇలాంటివి పలు సంచలన నిర్ణయాలు చాలా తీసుకున్నారు.


వీటి మీద ప్రతిపక్ష టీడీపీతో పాటు, జనసేన, బీజేపీ కూడా అనేక రకాలుగా విమర్శలు చేశాయి. అయినా సరే జగన్ వెనక్కి తగ్గకుండా వాటిని అమలు చేస్తున్నారు. అయితే ఈ నిర్ణయాలపై మొదట్లో కొంత వ్యతిరేకిత వచ్చిన...నిదానంగా వాటి వల్ల వచ్చే సత్ఫలితాలు ప్రజలకు తెలుస్తున్నాయి. కానీ ఇసుక కొరత విషయంలో మాత్రం వ్యతిరేకత పోలేదు. ఇసుక మీద కొత్త పాలసీ ప్రకటించిన, తగినంత లభ్యం కావడం లేదు. పైగా ప్రభుత్వ ధర ఒకటి నిర్ణయిస్తే, ఇసుక రీచ్ ల దగ్గర వేరే ధర ఉంటుంది.  


ఈ క్రమంలోనే ప్రజల్లో వ్యతిరేకిత తొలగించేందుకు జగన్ తాజాగా సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ జిల్లాల్లోని 2 వేల మంది నిరుద్యోగ బీసీ, ఎస్సీ, ఎస్టీ, యువకులకు ఆయా కార్పొరేషన్ల ద్వారా ఇసుక రవాణా వాహనాలను ఇప్పించి వారికే ఇసుక కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. దీని వల్ల ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కూడా దొరుకుతుందని జగన్ ఆలోచన.


అయితే ఇప్పటికే జగన్ గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు, వైన్ షాపుల్లో నాలుగు లక్షల నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఇసుక కాంట్రాక్టుల వల్ల రాష్ట్రంలోని 26 వేల మంది నిరుద్యోగులకు లబ్ది కలుగుతుంది. ఈ కార్యక్రమాలని చూస్తుంటే జగన్ నిరుద్యోగ యువతని టార్గెట్ చేసుకుని అదిరిపోయే స్కెచ్ వేశారని కనిపిస్తోంది. ఎందుకంటే ఉద్యోగాలు పొందిన వారు వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశముంది.


అలాగే ఉద్యోగులు ఉన్న కుటుంబాలు కూడా జగన్ కు మద్ధతు ఇవ్వడం ఖాయం. కొత్తగా  ప్రభుత్వం గురించి ఉద్యోగులు పాజిటివ్ గా ప్రచారం చేస్తూ ప్రజల్లో వ్యతిరేకిత పోగొట్టవచ్చు. ఈ విధంగా చూసుకుంటే రాబోయే స్థానిక, మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి మరింత అడ్వాంటేజ్ వచ్చే అవకాశముంది. మొత్తంమీద జగన్ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ అదిరిపోయే స్కెచ్ వేశారనే చెప్పొచ్చు.  



మరింత సమాచారం తెలుసుకోండి: