ఎమ్మెల్యే రోజా గాంధీ జయంతి సందర్భంగా చాలా బిజీ అయ్యారు.  ఈరోజు చిత్తూరు జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా ఉదయం గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం రోజా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.  చిత్తూరు జిల్లాలోని పుత్తూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం విద్యార్థుల కోసం ఓపెన్ జిమ్ ను ఏర్పాటు చేసింది.  


జిమ్ ను ఓపెన్ చేసిన అనంతరం రోజా కాసేపు జిమ్ లో సందడి చేసింది.  అక్కడి జిమ్ పరికరాలతో కసరత్తులు చేశారు.  అనంతరం రోజా నగరి నియోజక వర్గంలో గ్రామ సచివాలయ భవనాలను ప్రారంభించారు. వైకాపా విజయం సాధించిన తరువాత రోజాకు తప్పకుండా మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు.  కానీ, ఆమెకు పదవి లభించలేదు.  దీంతో కొన్ని రోజులపాటి అలిగి హైదరాబాద్ లోనే ఉన్నారు.  


ఈ విషయం గమనించిన వైఎస్ జగన్ ఆమెను పిలిచిమాట్లాడారు .  ఆమెకు తప్పకుండా పదవి ఇస్తానని హామీ ఇచ్చారట.  దానికంటే ముందు రోజాకు ఏపీఐఐసి చైర్మన్ పోస్ట్ ను ఇచ్చారు.  ఇది నామినేటెడ్ పోస్ట్  అయినప్పటికీ మంచి పోస్ట్ కావడంతో కాదనలేకపోయింది. ఎంతైనా.. మంత్రి పదవిలో ఉండటం వేరు.. ఇలాంటి నామినేటెడ్ పోస్ట్ లలో ఉండటం వేరు.  వచ్చే రెండేళ్లలో ఆమెకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందనే నమ్మకంతో ఉన్నది రోజా.  


ఏమో ఈలోగా కూడా ఆమెకు మంత్రి పదవి దక్కవచ్చు.  కొంతమంది వ్యక్తులపై ఇప్పటికే జగన్ కు నెగెటివ్ గా వార్తలు అందుతున్నాయి.  అలాంటి వ్యక్తులను జగన్ ఏ క్షణంలోనైనా తొలగించే అవకాశం ఉన్నది.  పోస్ట్ ఖాళీ ఆయిన వెంటనే మొదటగా జగన్ కు గుర్తుకు వచ్చే వ్యక్తి రోజానే.  రోజాను ఎప్పుడు పిలిచినా ఆమె అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా రోజాకు మంత్రి పదవి వస్తుంది అనడంలో సందేహం అవసరం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: