రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యంలో జరిగిన కొన్ని వివాదాలు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్ధాలు గడిచినా జీడిపాకంలా సాగే వివాదాలు కూడా ఉన్నాయి. అలాంటి కేసే భారత్, పాకిస్తాన్ మధ్య  కొన్నేళ్లుగా కొనసాగి ఆ సుదీర్ఘ వివాదానికి ఈ మద్యనే శుభం కార్డేసింది. బ్రిటన్ బ్యాంకులో దశాబ్ధాలుగా మూలుగుతున్న నిజాం సంపదపై లండన్ లోని బ్రిటీష్ న్యాయస్థానం తీర్పు వెలువరించింది.

సంపద నిజాం వారసులకే చెందుతాయని 'జస్టిస్ మార్కస్ స్మిత్' ఆ నిధులను వారికి అందజేసేలా ఏర్పాట్లు చేయాలని బ్యాంకు అధికారు లను ఆదేశించారు. ఆ నిధులను నాడు ఆయుధ నౌకలకు చెల్లింపుల కోసం ఉద్దేశించినవని, తమకు బహుమతిగా వచ్చినవని పాకిస్తాన్ వినిపించిన వాదనలను ఆ హైకోర్టు తోసిపుచ్చింది. పాకిస్తాన్ వాదనలో ఎలాంటి విషయం లేదని ఆ సంపద ఇండియాకే చెందుతుందని జస్టిస్ స్మిత్ స్పష్టంగా తీర్పిచ్చారు.

1947 భారత విభజన సమయంలో హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌ లో కలపాలా? లేక పాకిస్తాన్‌ లో కలపాలా? అని హైదరాబాద్ ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ డోలాయమాన స్థితిలో ఉన్న సమయంలో అంటే 1948లో ముందు చూపుతో నిజాం బ్రిటన్‌ లోని పాకిస్థాన్‌ హై కమిషనర్‌ హబీబ్‌ ఇబ్రహీం రహముతుల్లాకు పది లక్షల పౌండ్లు బదిలీ చేసి, భద్రంగా ఉంచాలని కోరారు.
Image result for prince mukarram jah prince muffakham jah
లండన్‌ లోని నాట్‌వెస్ట్‌ బ్యాంక్‌ పీఎల్‌సీ లో ఈ నిధులు జమయ్యాయి. ఇప్పుడు ఆ సొమ్ము 3.5 కోట్ల పౌండ్లకు (అంటే సుమారు 308 కోట్ల రూపాయిలు) చేరింది ఆ సంపద విలువ. అయితే, ఆ డబ్బు తమకే చెందుతుందని నిజాం వారసులు ప్రిన్స్‌ ముకరంజా, ప్రిన్స్‌ ముఫఖంజా తమ వాదన వినిపిస్తున్నారు. అయితే వారికి భారత్‌ ప్రభుత్వం మద్దతు తెలుపుతు తన సహకారం అందిస్తుంది. ఐతే పాకిస్తాన్ మాత్రం ఆ సంపద తమకు చెందుతుందని వాదిస్తూ వచ్చింది.
Image result for prince mukarram jah prince muffakham jah today
ఈ కేసును జడ్జి జస్టిస్‌ మార్కస్‌ స్మిత్‌ రెండు వారాల పాటు విచారణ కొనసాగించారు. ఆపై నేడు తీర్పు వెల్లడించారు. నిజాం నిధులపై ఇండియా-పాకిస్తాన్ మధ్య వివాదం జరిగిన సమయంలో నిజాం వారసులు పసివాళ్ళు. అయితే ఇప్పుడు ముకరంజా, ముఫఖంజా వయస్సు 80 ఏళ్లు పైగా ఉంది. నేడు కోర్టు తీర్పును నిజాం వారసులు 70 ఏళ్ల తమ పోరాటం ఫలించిందని సంతోషం వ్యక్తం చేశారు.

Image result for prince mukarram jah prince muffakham jah today

మరింత సమాచారం తెలుసుకోండి: