ఇదేంటండి బియ్యాన్ని డబ్బులు పెట్టికదా కొనుక్కొనేది మరి పనికి రాని చెత్తనిస్తే బియ్యాన్ని ఇస్తానని అంటున్నారు.ఈ పధకం వినడానికి వింతగుంది.ఇక చెత్త ఏరుకుని జీవించే వాళ్లు ఈ బియ్యంతో మూడుపూటలా తినవచ్చూ అని అనుకుంటు న్నారా.ఇది వినడానికి చాలాఆసక్తిగా ఉందికదూ.నిజంగానే ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణంలో కాలుష్యంపెరిగి మానవ  మనుగడకే ప్రమాదం ఏర్పడుతున్న ఈ సమయంలో,తమవంతుగా ఆ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకున్న నిర్ణయం ఇది.



అయితే మనం అనుకున్నట్లుగా ఇది మన దేశంలో మాత్రం కాదు.పిలిప్పీన్స్‌లో ఓ గ్రామ పాలక మండలి ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.ఎక్కడ ప్లాస్టిక్ కనిపించినా,దాన్ని సేకరించి తమకు ఇస్తే,బియ్యం ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టారు.ఇక వారు తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ గ్రామంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలే కనిపించడం లేదంటున్నారు అక్కడి స్దానికులు.వీరు చేస్తున్న పనికి పర్యావరణ పరిరక్షకులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఈ పనిలో తమవంతుగా సహయం అందిస్తామని హామీ కూడా ఇచ్చారట.



ఇకపోతే ఇప్పటికే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి.మన దేశంలోనూ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు నుంచి ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను వాడకాన్ని తగ్గించేందుకు కేంద్రం శ్రీకారం చుట్టింది.దీన్ని అంతా ఓ ఉద్యమంలా తీసుకెళ్లాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు కూడా.ఇకపోతే ప్లాస్టిక్‌ రేపర్లు, షీట్లు, క్యారీబ్యాగులు,వాటర్‌ బాటిళ్లు,ఇలా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను తగ్గించేందుకు ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు.మొత్తానికి పర్యావరణానికి హానికరమైన ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావడం హర్షనీయమని పలువురు పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.



ఈ ఉద్యమం గనుక సక్రమంగా అమలైతే భావితరాల భవిష్యత్తుకు మనమిచ్చే పెద్దకానుక ఇదే అవుతుందంటున్నారు కొందరు భవిష్యత్తు కోసం ఆలోచించే పెద్దలు.ఇక ఇప్పటికే ప్రకృతి పూర్తిగా నాశనమై గాలిలో,నీటిలో తినే ఆహారంలో ఎన్నో విషపదార్ధాలు మిళితమవుతున్నాయి.వాటివల్ల మానవుని ఆయుష్షు అంతంకంతకు తగ్గి మందులకు తగ్గని రోగాల బారినపడి ఎన్నోఅవస్ధలు అనుభవిస్తున్నాడు.అందుకే పర్యావరణానికి గాని,ప్రాణాలకుగాని హానికలిగించే ఏవిషయాన్ని ఉపేక్షించకుం డా తగిన చర్యలు తీసుకుంటే కనీసం భావితరాలైన ఆరోగ్యంగా జీవిస్తారు...

మరింత సమాచారం తెలుసుకోండి: