ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నవ శకానికి నంది పలుకుతున్న శుభతరుణంలో గ్రామ గ్రామాన ఓ పండుగ వాతారణం నెలకొందని చెప్పాలి. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా మున్సిపల్ కమీషనర్ అయిపోయారు. సందల్లో సడేమియా అన్న చందంగా పురపాలక శాఖ  హడావిడికి పరాకాష్టగా సీఎం జగన్ ను కమీషనర్ గా మార్చేశారు. ఈ సంఘటన విజయనగరంలో చోటు చేసుకుంది. అక్కడ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ను మున్సిపల్ కమిషనర్‌గా మార్చేశారు. అసలేం జరిగిందంటే.. పార్వతీపురం పురపాలక శాఖ తప్పిదం రాష్ట్ర ప్రజలకు నవ్వులాటగా మారింది.



వార్డు సచివాలయం ప్రారంభం కార్యక్రమం సందర్భంగా ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో పార్వతీపురం మున్సిపల్ కమిషనర్‌ స్థానంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్  ఫొటో పెట్టారు. అంతే కాకుండా ప్రత్యేక అధికారిగా స్థానిక ఎమ్మెల్యే జోగారావు ఫోటోను పెట్టారు. ఈ ఫ్లెక్సీని వార్డు సచివాలయం ముందు ఏర్పాటు చేశారు. దీంతో ఫ్లెక్సీని చూసిన ప్రజలు నవ్వుకుంటున్నారు. అనంతరం తప్పిదం తెలసుకున్న మున్సిపల్ అధికారులు.. వెంటనే ఫ్లెక్సీని తొలగించారు. అది వేరే విషయం. ఇదిలా ఉండగా తూర్పు గోదావరి జిల్లా రాజోలు గ్రామ సచివాలయం  ప్రారంభోత్సవం  కార్యక్రమంలో పాల్గొన్న రాజోలు జనసేన ఎమ్మెల్యే  రాపాక వరప్రసాద్ సీఎం జగన్ పైన  విమర్శనాస్త్రాలను సంధించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...




సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం  అన్ని విషయాలలోనూ  విఫలం చెందిందని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నడూలేని  విద్యుత్ కోతలు ఈ ప్రభుత్వంలో విద్యుత్ కోతల వల్ల   ప్రజలు  నానా అవస్థలు పడుతున్నారని. విద్యుత్ కోతల పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందారని దుయ్యబట్టారు.విద్యార్థులు కిరోసిన్ దీపం  వద్ద చదువుకునే పరిస్థితులు దాపురించిందని విమర్శించారు. పట్టుదలకు పోకుండా పవన విద్యుత్ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. తక్షణం ఇసుక సరఫరా అమలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వంలో ఇసుక దందా నడిచిందని ఈ ప్రభుత్వంలో అటువంటి దందాలను అరికట్టాలని సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: